Viral Video: ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్‌చేసి అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే కొడుకు..!
Viral Video: సాధారణంగా ఎవరైనా కేక్ షాపులో ఇచ్చే ప్లాస్టిక్ కత్తితోనే బర్త్ డే కేకులు కట్ చేస్తారు. కానీ, అతను మాత్రం తాను అందరిలా ప్లాస్టిక్ చాక్‌తో కేక్ కట్ చేస్తే స్పెషల్ ఏం ఉంటుందనుకున్నాడో లేదంటే తాను ఓ బడా నాయకుడి బిడ్డను అన్న అహంకారమో గానీ కర్ణాటకలో ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఏకంగా ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లు కట్ చేశాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ కేక్ కటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగూర్ కొడుకు సురేష్ దడేసుగూర్ గురువారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. సురేష్ అనే పేరులోని ఒక్కో అక్షరం ఆకారంలో ఒక్కో కేక్‌ను తయారు చేయించాడు. ఆ కుకులన్నింటిని వరుసగా పెట్టి ఖరీదైన ఐఫోన్‌తో కట్ చేశాడు.
Viral Video: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్‌లు..
బళ్లారి జిల్లాలోని హోస్‌పేటలో జరిగిన ఈ వేడకలకు ఎమ్మెల్యే కొడుకు సురేష్ తన స్నేహితులతో కలిసి బీఎండబ్ల్యూ కారులో వచ్చాడు. ఈ కేక్ వీడియోలపై నెటిజన్‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. సొమ్ము ఉందన్న అహంకారంతో ఇలా చేశాడా.. లేదంటే పేదవాళ్లను ఎగతాళి చేసే ఉద్దేశంతోనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా.. ఎన్నికలప్పుడు ప్రచారం కోసం చందాలు వసూలు చేసిన ఎమ్మల్యే బసవరాజుకు ఇప్పుడు కార్లు, బంగళాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తున్నారు.
దీనిపై ఎమ్మెల్యే బసవరాజు స్పందిస్తూ.. తన కొడుకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే బర్త్‌డే చేసుకున్నాడని, తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పాడు. ఐఫోన్ కూడా తన డబ్బులతోనే కొనుక్కున్నాడని, అందులో తప్పేముందని ప్రశ్నించాడు. కరోనా మహమ్మారి కారణంగా చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించి ఉంటాడు దానిపై అభ్యంతరం దేనికి అంటూ కొడుకునే వెనకేసుకొచ్చాడు.
https://twitter.com/Csoumya21/status/1433654489819410435?s=20