Breaking : పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక మలుపు..
Breaking : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం కేసు మరో కీలక మలుపు తిరిగింది. తన కుమారుడు వనమా రాఘవేందర్ రావుపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు స్పందించారు. రామకృష్ణ కుటుంబం సూసైడ్ చేసుకోవడం బాధకరమైన విషయమంటూ.. తదుపరి దర్యాప్తునకు తాను అన్ని విధాల సహకరిస్తానంటూ బహిరంగ లేఖ రాశారు.
ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టిస్తోన్న నేపథ్యంలో రాసిన ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందన్న వెంకటేశ్వర్ రావు… తన కొడుకునూ ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. కేసు కొలిక్కి వచ్చేదకా తన కొడుకు రాఘవేంద్రను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని ఆయన హామీ ఇచ్చారు.
ఇక ఈ వివాదం పట్ల విపక్షాలు మండి పడుతున్నాయి. కొడుకును ముందే జాగ్రత్త పెడితే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదంటున్నారు. అన్యాయంగా ఓ నిండు కుటుంబాన్ని బలి చేశారంటూ ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు.. రామకృష్ణ సెల్ఫీ వీడియోతో పాటు పలు అంశాలను సాక్ష్యాలుగా తీసుకొని రాఘవేంద్రను ఈ కేసులో A2గా చేర్చారు.