KTR : కేటీఆర్ సీఎంగా వద్దే వద్దు.. కేటీఆర్ కన్నా ఆ మంత్రిని సీఎం చేస్తే బెటర్.. ఆ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్?
KTR : తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ కు త్వరలోనే సీఎం కేసీఆర్ పట్టాభిషేకం చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఈ విషయంలోనూ పెద్ద యుద్ధమే జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఇతర నాయకులు మాత్రం.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందే. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. అంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
కానీ.. కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం కేటీఆర్ ను ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తారు? ఆయన వద్దు అని కొందరు.. ఇంకొందేమో.. ఆయన ముఖ్యమంత్రికి అర్హుడు అయినా కూడా వేరే మంత్రిని ముఖ్యమంత్రిని చేయాలంటూ సలహాలు ఇస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం పదవికి కేటీఆర్ అర్హుడు అయినప్పటికీ… కేటీఆర్ కన్నా.. మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేస్తే బెటర్.. అంటూ స్పష్టం చేశారు.
KTR : ఈటలకు నా అభినందనలు.. జీవన్ రెడ్డి
తెలంగాణలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకూడదంటే… కేటీఆర్ కు బదులు ఈటలను ముఖ్యమంత్రిని చేయాలి. కొనుగోలు కేంద్రాల గురించి, వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడిన ఈటలకు అభినందనలు. గెలవగానే మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. పసుపు బోర్డు తెస్తాం.. అని చెప్పిన అర్శింద్ ఎక్కడున్నారు? అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన జీవన్ రెడ్డి
ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. అప్పట్లో ఓ కింటా పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది.. ఇప్పుడు తులం బంగారం విలువ 50 వేలకు పైన ఉంది. కానీ.. పసుపు మాత్రం కింటాకు 6 వేలకే పడిపోయింది. పసుపు బోర్డు గురించి.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు కేంద్ర ప్రభుత్వం.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.