Home » Exclusive » Mlc Kavitha And Malla Reddy Daughter In Law Dance At Holi Celebrations
Exclusive

Minister MallaReddy : మంత్రి మల్లారెడ్డి కోడలితో డాన్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 8, 2023, 2:08 pm
Advertisement

Minister MallaReddy : మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో మహిళా దినోత్సవంతో పాటు హోలీ పండుగలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి కోడలితో హోలీ సంబరాలలో డాన్స్ చేశారు. ఇదే సమయంలో సమాజంలో మహిళలు రాణిస్తున్న విధానాన్ని కవిత తెలియజేశారు. అన్ని రంగాలలో ఆడవాళ్లు రాణిస్తున్నారని కొనియాడారు. తాను కూడా ఇంజనీరింగ్ చదివినట్లు కంప్యూటర్ విభాగంలో… కోర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

MLC Kavitha And Malla Reddy Daughter In Law Dance At Holi Celebrations

ఇక ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మరింతగా రాణించాలని.. ఉద్యోగాలు చేయాలన్నే ఉద్దేశం మాత్రమే కాకుండా కంపెనీలు పెట్టి ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి పూర్తిగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఐడియా ఉంటే పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని.. వారితో కలిపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

చాలామంది పెట్టుబడిదారులకు ఐడియాలు లేక ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంజనీర్స్ మంచి ఐడియాలతో వస్తే చాలామంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అవకాశాలు చాలా ఉన్నాయి అందరూ… అందిపుచ్చుకోవాలని ప్రసంగించారు. ఇదే సమయంలో మల్లారెడ్డి అన్న స్పీచ్ లు పేటెంట్ చేసుకోవాలని సూచించారు. ఈమధ్య అన్న స్పీచ్ లు చాలా హైలైట్ అవుతున్నాయని సినిమాలో కూడా వచ్చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో ప్రసంగించారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి