Modi : దేశం దృష్టిని ఆకర్షిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు… మోడీ షా లకు ఇది అమితుమి
Modi : దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నగారా మ్రోగించింది. ఈ అయిదు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్ వైపు ప్రస్తుతం దేశ రాజకీయ నాయకులు ఆసక్తిగా చూస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంగా.. అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రంగా యూపీ ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్ర ఎన్నికల పై ఎప్పుడు కూడా ఆసక్తి ఉంటూనే ఉంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. యోగి ఆదిత్య నాద్ అక్కడ సీఎంగా ఉన్నాడు. ఆయన్ను అత్యంత పవర్ ఫుల్ సీఎంగా చెబుతూ ఉన్నారు. కాబోయే ప్రధాని అని కూడా ఆయన్ను అంటున్నారు. అలాంటి యూపీలో ఎన్నికలు అంటే ఖచ్చితంగా యోగి మళ్లీ సీఎం అవుతాడనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయ్యి అయినా కూడా యోగి ఆధిత్య నాథ్ మళ్లీ సీఎం అవ్వకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ని అధికారం నుండి దించడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా యూపీలో బీజేపీ ఎంపీ స్థానాలను తగ్గించవచ్చు. తద్వారా ఖచ్చితంగా కేంద్రం నుండి బీజేపీ కూటమిని దించవచ్చు అనేది కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే బీజేపీ అధినాయకత్వం పార్లమెంట్ కు ఏ స్థాయిలో సన్నద్దం అవుతారో అదే స్థాయిలో యూపీ ఎన్నికలకు కూడా సన్నద్దం అవుతున్నారు. ప్రథాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా మొదలుకుని మొత్తం కేంద్ర మంత్రులు అంతా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దం అయ్యారు.
Modi : యోగి ఆధిత్య నాథ్ కు ఇది అసలైన పరీక్ష
హిందుత్వమే ఆయన ప్రథాన అజెండా. ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయనకు ముస్లీంల ఓట్లు అస్సలు అక్కర్లేదు. ఆయన యోగి ఆదిత్య నాద్ కనుక ఇతర మతాల వద్దకు వెళ్లి ఓట్లు అడగడు. ఓట్ల కోసం ముస్లీం క్యాప్ పెట్టుకోడు.. క్రిస్టియన్ సిలువ పట్టుకోడు. ఆయనకు తెలిసింది ఒక్కటే కాషాయం. కనుక ముస్లీంల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా ఆయనకు రావు. కాని ఆయన మతంకు చెందిన హిందువులు మాత్రం ఆయన్ను మళ్లీ సీఎం చేస్తారని అంటున్నారు. మోడీ మరియు అమిత్ షా ల రాక కేవలం యూపీలో మెజార్టీ కోసమే తప్ప యోగి ని సీఎం గా చేసేందుకు కాదు అనేది కొందరి వాదన. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మంచి జరుగుతుంది. అందుకే ఇది ఖచ్చితంగా మోడీ మరియు షా లకు అమితుమి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఎవరేం అన్నా కూడా ఖచ్చితంగా ఇది దేశ రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికర ఎన్నిక అనడంలో సందేహం లేదు.