Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన పనికి మోదీ సీరియస్.. ఇంకోసారి అలా చేయకంటూ కూల్ వార్నింగ్
Pawan Kalyan : ప్రస్తుతం ఎన్నికల వేడి అంతటా సాగుతుంది. అయితే ఏపీలో మాత్రం చాలా వేడెక్కిపోతుంది. టీడీపీ-జనసేన- బీజేపీ జతకట్ట వైసీపీని ఓడించే ప్రయత్నంలో ఉన్నారు. మే 13న ఎలక్షన్స్ జరగనున్నాయి. మరో ఆరు రోజులలో ఎలక్షన్స్ జరుగుతాయి. అందుకే అన్ని పార్టీలు కూడా ప్రచార హోరును ఆంధ్రాలో పెంచారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తూ.. కూటమి విజయం కోసం శ్రమిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాదారంగా ఆహ్వానిస్తూ… ఆయనకు ప్రేమతో వందనం చేశారు.
స్వీట్ వార్నింగ్
మోదీ కూడా అంతకు మించిన ప్రేమతో రెండు చేతులెత్తి అభివాదం చేశారు. దాంతో వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.మోదీని పవన్ కళ్యాణ్.. భుజాల మీదుగా ఎంతో ప్రేమతో పవన్ కల్యాణ్ శాలువాను సవరించి అభివాదం చేస్తూ కప్పారు. తనపై చూపించిన ప్రేమను స్వీకరిస్తూ.. పవన్ రెండు చేతులు పట్టుకొని.. తన తలను ఆయన చేతుల్లో పెట్టి జనసైనికుడికి తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత మోదీ కాళ్లని తాకారు.
అయితే ఒక్కసారి ఆ సమయంలో మోదీ నిర్ఘాంతపోయినట్టు అయింది. వెంటనే తేరుకొని ప్రధానిని లేపి ఇంకోసారి ఇలా చేయకు అంటూ కూల్ వార్నింగ్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. ప్రేమగా పవన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక రాజమండ్రిలో జరిగిన భారీ సభలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకున్నారు. బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సభ భారీగా సక్సెస్ అయిందని కూటమి వర్గం సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సభ ద్వారా పవన్ అంటే మోదీ హృదయంలో ఎలాంటి స్థానం ఉందో మరోసారి అందరికి అర్ధమైంది.