Mouth Ulcers | త‌ర‌చుగా నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) .. కారణాలు, నివారణ చిట్కాలు ఇవే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mouth Ulcers | త‌ర‌చుగా నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) .. కారణాలు, నివారణ చిట్కాలు ఇవే!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 September 2025,9:00 am

Mouth Ulcers | నోటి పూత లేదా నోటి పుండు అనేది సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇది నోటి లోపల, దవడలు, నాలుకపై చిన్న పుండ్లు మాదిరిగా కనిపిస్తుంది. ప్రాణాలకు హానికరం కాకపోయినా, తినేప్పుడు, మాట్లాడేప్పుడు కలిగే నొప్పి వల్ల తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

#image_title

నోటి పుండ్లకు కారణాలు ఏంటి?

– అనుకోకుండా అన్నం తినేటప్పుడు నాలుక కొరకడం లేదా బ్రష్ చేసినప్పుడు గాయం అవ్వడం వల్ల పుండ్లు వస్తాయి.
-కారం ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నోటి లోపల ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడుతుంది.
-సిట్రస్ పండ్లు (లెమన్, ముసంబి) ఎక్కువగా తినడం వల్ల నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
-విటమిన్ లోపాలు: ముఖ్యంగా విటమిన్ B9, B12, ఐరన్, జింక్ లాంటి పోషకాల కొరత వల్ల నోటి పూత వస్తుంది.
-హార్మోన్ మార్పులు: గర్భధారణ, పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు కూడా నోటి పుండు వచ్చే అవకాశం పెంచుతాయి.
-ఒత్తిడి (స్ట్రెస్): మానసిక ఒత్తిడితో పాటు శారీరకంగా కూడా నొప్పులు, అలసట పెరిగి నోటి పుండ్లు వస్తాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి:

కారం, యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాలను నివారించండి

రోజూ సరిపడే విటమిన్లు తీసుకుంటున్నారా చెక్ చేసుకోండి

నీళ్లు ఎక్కువగా తాగండి

శుభ్రత పాటించండి – నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి

ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, నిద్రపై దృష్టి పెట్టండి

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది