మ‌న‌సు మార్చుకున్న‌ రఘురామ మ‌ళ్లీ ఆ పార్టీ వైపు…!

raghu rama krishnam raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు  raghu rama krishnam raju అంశం ఏపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశమైన విషయం. తన ఫొటోతో గెలిచి ఎంపీ అయిన వ్యక్తితో పోరాడుతున్నారు సీఎం జగన్. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకే వీరి మధ్య సఖ్యత నెలకొందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏడాదిన్నరగా జగన్ ను ఇరుకున పెట్టే విధంగానే రఘురామ వ్యవహరిస్తున్నారు. ఇటివలి ఆయన అరెస్టు, సుప్రీం నుంచి బెయిల్.. ఇవన్నీ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో రఘురామకు కాస్త అండగా నిలుస్తోంది టీడీపీ. ఇప్పుడు రఘురామ చూపు టీడీపీపై పడిందని అంటున్నారు.

2014 ఎన్నికలకు ముందే వైసీపీలో… raghu rama krishnam raju

raghu rama krishnam raju

నిజానికి రఘురామ 2014 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన టీడీపీలో కూడా కొనసాగారు. ఆ పార్టీలో పొసగక వైసీపీ గూటికి వచ్చి ఎంపీ అయ్యారు. అయితే.. ఇక్కడా అదే పరిస్థితి. కానీ.. రఘురామకు సీఎం జగన్ కు మధ్య జరుగుతున్న ఫైట్ లో టీడీపీ రఘురామకు మద్దతుగా నిలిచింది. గతంలో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయిన సంగతిని వదిలేసి మద్దతు ఇస్తోంది. ఇటివల ఆయన తరపున లాయర్లను ఏర్పాటు చేసిందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రఘురామ కూడా తనకు ఇంతగా మద్దతిస్తున్న టీడీపీ వైపు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని ప్రతి నేత కూడా రఘురామకృష్ణ రాజుకు మద్దతిచ్చారు.

అయితే.. రఘురామకృష్ణ రాజుకు raghu rama krishnam raju ఎంపీగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయా కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. ఆమధ్య రఘురామ బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. ఇటివలి ఆయన అరెస్టుల సమయంలో బీజేపీ నుంచి మద్దతు రాలేదు. దీంతో బీజేపీ కంటే ఏపీలో టీడీపీ బెటర్ అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే మూడేళ్లు వైసీపీలోనే వ్యతిరేకంగా ఉండి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే టీడీపీ నుంచి మద్దతు కూడగట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలన్నా.. రఘురామ మనసులో ఏముందో బయటకు రావాలన్నా మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Recent Posts

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

16 minutes ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

4 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

5 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

7 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

8 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

17 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

18 hours ago