Parrot Evidence : హత్య చేసి ఏం తెలియకుండా ఇంటికొచ్చిన హంతకుడు.. దొంగని పట్టించి సాక్ష్యం చెప్పిన చిలక… వీడియో
Parrot Evidence : టైటిల్ చూడగానే షాకయ్యారా? మీరు చదివింది నిజమే. ఒక మర్డర్ మిస్టరీని చిలక ఛేదించింది. ఆ రామ చిలుక సాక్ష్యం చెబుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ.. చరిత్రలోనే తొలిసారి రామచిలుక సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. అసలు మర్డర్ మిస్టరీకి సంబంధించి చిలుక ఎలా సాక్ష్యం చెప్పింది.. ఈ కేసు ఎలా సాల్వ్ అయిందో వివరంగా తెలుసుకుందాం రండి. 9 ఏళ్ల క్రితం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. చివరకు ఒక రామచిలుక సాయంతో ఆ కేసును సాల్వ్ చేయగలిగారు పోలీసులు.
2014 లో ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. విజయ్ శర్మ.. ఒక జర్నలిస్ట్. తన ఫ్యామిలీతో కలిసి ఫిరోజాబాద్ లోని పెళ్లికి వెళ్లారు. ఆ పెళ్లికి విజయ్ శర్మ.. తన కొడుకు, కూతురుతో వెళ్లాడు. తన భార్య నీలం శర్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంటి వద్దే ఉంది. తన ఇంట్లో ఒక కుక్క, రామచిలుక ఉంటాయి. వాటిని నీలం పెంచుకుంటోంది. విజయ్ శర్మ.. పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చి చూడగానే ఇంట్లో పెంచుకుంటున్న కుక్క చనిపోయి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగానే నీలం శర్మ విగతజీవిగా ఉంది. తనను ఎవరు చంపారు అనేది అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా మాయం కావడంతో ఎవరైనా దుండగులు డబ్బుల కోసం నీలంను చంపారేమో అని అనుకున్నాడు విజయ్. పోలీసులు కూడా ఈ కేసును సాల్వ్ చేయలేకపోయారు.
Parrot Evidence : నీలంmurder case solved by parrot in india మేనకోడలే అసలు హంతకురాలు
అయితే.. విజయ్ ని పరామర్శించడానికి ఒక రోజు తన మేనకోడలు అషూ వచ్చింది. తనను చూడగానే రామ చిలుక గట్టిగా అరిచింది. ఎవ్వరు వచ్చినా కూడా అరవని రామచిలుక.. విజయ్ మేనకోడలు రాగానే ఎందుకు అరిచింది అని అంతా అనుకున్నారు. అలా.. రెండు మూడు సార్లు ఆ యువతి రాగానే రామచిలుక అరుస్తూ భయపడటంతో విజయ్ కి అనుమానం వచ్చి పోలీసులకు తన మేనకోడలు గురించి చెప్పాడు. దీంతో ఆమె మీద నిఘా పెట్టారు పోలీసులు. ఆ తర్వాత తీగ లాగితే డొంక అంతా కదిలింది. నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసమే నీలంని చంపేశామని అషు పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో అషు, తన బాయ్ ఫ్రెండ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది.