muskmelon health benefits in summer season
Muskmelon : వేసవి వచ్చిందంటే చాలు… చాలామంది వేడి తగ్గించే పండ్లను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎండాకాలంలో ఎక్కువగా పుచ్చకాయలు మార్కెట్ లో విరివిగా దొరుకుతుంటాయి. పుచ్చకాయలు శరీరానికి ఎంత మంచిది. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే… వేసవిలో పుచ్చకాయలతో పాటు తర్బూజా పండ్లు కూడా విరివిగా దొరుకుతుంటాయి. సాధారణంగా ఏ పండ్లు అయినా చాలా తియ్యగా ఉంటాయి. తింటుంటే తినబుద్ధి అయ్యేలా ఉంటాయి. కానీ.. తర్బూజా పండ్లు మాత్రం చాలా చప్పగా ఉంటాయి. అందుకే… తర్బూజా పండ్లను డైరెక్ట్ గా తినలేరు. అందుకే… వీటిని జ్యూస్ లుగా చేసుకొని తాగుతుంటారు. జ్యూస్ లలో చక్కెర కలుపుకొని తాగుతుంటారు. దాని వల్ల వేసవి బాధ నుంచి కాసేపు ఉపశమనం కలిగినట్టు ఉంటుంది. అయితే… చాలామందికి తెలియని విషయం ఏంటంటే… తర్బూజా పండ్లను జ్యూస్ లా చేసుకొని… చక్కెర కలుపుకొని తాగడం కన్నా.. తేనె కలుపుకొని తాగడం మేలు. అయితే.. అసలు వేసవి కాలంలో తర్బూజా పండ్లను తినొచ్చా? లేదా? తింటే ఏమౌతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
muskmelon health benefits in summer season
వేసవి కాలంలోనే కాదు… ఏకాలంలో అయినా సరే.. తర్బూజా పండ్లను ఖచ్చితంగా తినాల్సిందే. అసలు… ఈ పండ్లలో ఉండే విటమిన్లు మరే పండ్లలో ఉండవు. శరీరానికి కావాల్సిన విటమిన్లు చాలా ఈ పండులో ఉంటాయి. ఈ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ తో పాటు విటమిన్ ఏ, కే, బీ6 ఉంటాయి. అలాగే… పుష్కలంగా మినరల్స్ కూడా ఉంటాయి. పొటాషియం, ఫోలేట్ యాసిడ్, నియాసిన్, మెగ్నీషియం, థయామిన్ తర్బూజాలో కావాల్సినంత ఉంటాయి. అందుకే రోజూ ఓ రెండు తర్బూజా చెక్కలు తింటే చాలు… శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి.
మీరు బరువు తగ్గాలనుకుంటే… తర్బూజా పండు ఎంతో మేలు చేస్తుంది. తర్బూజా పండ్లలో ఎక్కువ శాతం నీరు ఉండటం వల్ల… ఈ పండు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో వేరే ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. ఈ పండులో క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి కూడా దరిచేరకుండా ఉండాలంటే… తర్బూజాను రోజూ తినాల్సిందే. డీహైడ్రేషన్ సమస్యలు తగ్గాలన్నా… శరీరాన్ని వేసవి కాలంలో చల్లగా ఉంచాలన్నా.. నీరసంగా ఉన్నా… ఈ పండును తినేయాలి. తర్బూజాను ఖచ్చితంగా జ్యూస్ చేసుకొని తాగాలని ఏం లేదు…. పండ్లను ముక్కలుగా కోసుకొని కూడా తినొచ్చు. లేదంటూ జ్యూస్ చేసుకొని… తేనె కలుపుకొని తాగొచ్చు.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.