Mutton Fry Recipe : బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా మటన్ ఫ్రై చేసి పెడితే ఎవరికైనా నచ్చాల్సిందే…
Mutton Fry Recipe : ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్లకి వెరైటీస్ చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో ఏం వెరైటీ చేయాలో అసలు తోచదు. అటువంటి సమయంలో ఈ స్పెషల్ మటన్ వేపుడు చేసి పెట్టండి.. వాళ్లు ఒక్కసారి తిన్నారంటే ఇక మళ్లీ మళ్లీ మీ ఇంటికి వస్తూనే ఉంటారు. ఆ మటన్ వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. స్పెషల్ మటన్ వేపుడుకి కావలసిన పదార్థాలు : మటన్, కారం, ఉప్పు, పసుపు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, వాటర్, ధనియాల పొడి, జీలకర్రపొడి మొదలైనవి.
దీని తయారీ విధానం ముందుగా పప్పు కుక్కర్ లోకి ఆఫ్ కిలో మటన్ తీసుకొని దానిలో వేసి దానిలో నాలుగు పచ్చిమిర్చి చీలికలు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి గ్లాస్ నీటిని వేసి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఐదారు స్పూన్ల ఆయిల్ వేసి, ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలను వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత దానిలో రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి.
తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ని వాటర్ తో సహా దానిలో వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇక తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా ,ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇక చివరిగా దింపేముందు కొత్తిమీర చల్లి దింపుకోవాలి అంతే ఎంతో టేస్టీ గల స్పెషల్ మటన్ వేపుడు రెడీ. ఇది పప్పుచారులోకైనా రోటీలలో కైనా సూపర్ గా ఉంటుంది. ఇక దీనిని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు.