nadendla manohar requests mla rapaka varaprasada rao
Rapaka Varaprasada Rao : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేన తరపున గెలిచిన ఏకైకా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తక్కువ సమయంలోనే జనసేనలో జాయిన్ అయ్యాడు. మొదట జనసేనలోనే కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చిన రాపాక నియోజక వర్గం అభివృద్ది కోసం అంటూ పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించాడు. జనసేన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇప్పటికే ప్రకటించి ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా కోసం ప్రచారం చేయడం జరిగింది. రాపాక తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాని అధినాయకత్వం మాత్రం ఆయన తిరిగి పార్టీలోకి వస్తే తప్పకుండా తలుపులు తెరచి ఆహ్వానం పలుకుతాం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రాపాక నీతివంతుడు అయితే మళ్లీ జనసేనలోకి రావాలంటూ ఆ పార్టీ ప్రధాన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు.
రాజోలు నియోజక వర్గం మలికిపురంలో జరిగిన సభలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాపాక నియోజక వర్గంలో ఆయన వైకాపాకు వెళ్లినా కూడా కార్యకర్తలు మాత్రం పార్టీని వదిలి వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారి వల్లే రాపాక వర ప్రసాద్ అరెస్ట్ ఆగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు డీజీపీతో మాట్లాడారు. ఇప్పుడు వారి పోలీసులతో మన వారిపై దాడులు చేయిస్తున్నారు అంటూ నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభివృద్ది కోసం పార్టీ మారినట్లుగా చెబుతున్న రాపాక ఇప్పటి వరకు నియోజక వర్గంలో ఏం అభివృద్ది చేశారో చెప్పాలన్నారు. మంచి నీటి కోసం కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉందని, దమ్ముంటే మంచి నీటిని తీసుకు రావాలని సూచించాడు.
nadendla manohar requests mla rapaka varaprasada rao
కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తివి అనే ఉద్దేశ్యంతో నీపై పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం గౌరవం ఉంది. ఆ నమ్మకం గౌరవంతోనే నీకు సీటు ఇవ్వడం జరిగింది. కాని నువ్వు అధికార పార్టీలో చేరి ఆయన నమ్మకంను వమ్ము చేశావని అన్నారు. ఇప్పటికి కూడా కార్యకర్తలు మరియు జనసేన నాయకులు రాపాక రాకను కోరుకుంటున్నారు. ఆయన పార్టీలో చేరి మళ్లీ పార్టీ తరపున పని చేయాలని ఆశ పడుతున్నారు. ఈ సభా వేదిక నుండి మరో సారి రాపాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై రాపాక ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.