రాపాక కోసం ఇంకా జనసేన తలుపులు తెరిచే ఉన్నాయట.. నీతివంతుడైతే రావాలంటున్నారు

0
Advertisement

Rapaka Varaprasada Rao  : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేన తరపున గెలిచిన ఏకైకా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తక్కువ సమయంలోనే జనసేనలో జాయిన్‌ అయ్యాడు. మొదట జనసేనలోనే కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చిన రాపాక నియోజక వర్గం అభివృద్ది కోసం అంటూ పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించాడు. జనసేన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇప్పటికే ప్రకటించి ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా కోసం ప్రచారం చేయడం జరిగింది. రాపాక తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాని అధినాయకత్వం మాత్రం ఆయన తిరిగి పార్టీలోకి వస్తే తప్పకుండా తలుపులు తెరచి ఆహ్వానం పలుకుతాం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రాపాక నీతివంతుడు అయితే మళ్లీ జనసేనలోకి రావాలంటూ ఆ పార్టీ ప్రధాన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

rapaka varaprasada rao  : రాపాక చేసిన అభివృద్ది ఏంటీ…

రాజోలు నియోజక వర్గం మలికిపురంలో జరిగిన సభలో నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. రాపాక నియోజక వర్గంలో ఆయన వైకాపాకు వెళ్లినా కూడా కార్యకర్తలు మాత్రం పార్టీని వదిలి వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పవన్‌ కళ్యాణ్‌ గారి వల్లే రాపాక వర ప్రసాద్‌ అరెస్ట్ ఆగింది. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ గారు డీజీపీతో మాట్లాడారు. ఇప్పుడు వారి పోలీసులతో మన వారిపై దాడులు చేయిస్తున్నారు అంటూ నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభివృద్ది కోసం పార్టీ మారినట్లుగా చెబుతున్న రాపాక ఇప్పటి వరకు నియోజక వర్గంలో ఏం అభివృద్ది చేశారో చెప్పాలన్నారు. మంచి నీటి కోసం కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉందని, దమ్ముంటే మంచి నీటిని తీసుకు రావాలని సూచించాడు.

nadendla manohar requests mla rapaka varaprasada rao
nadendla manohar requests mla rapaka varaprasada rao

rapaka varaprasada rao  : పవన్ నీపై నమ్మకం పెట్టుకున్నారు..

కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తివి అనే ఉద్దేశ్యంతో నీపై పవన్‌ కళ్యాణ్‌ గారికి నమ్మకం గౌరవం ఉంది. ఆ నమ్మకం గౌరవంతోనే నీకు సీటు ఇవ్వడం జరిగింది. కాని నువ్వు అధికార పార్టీలో చేరి ఆయన నమ్మకంను వమ్ము చేశావని అన్నారు. ఇప్పటికి కూడా కార్యకర్తలు మరియు జనసేన నాయకులు రాపాక రాకను కోరుకుంటున్నారు. ఆయన పార్టీలో చేరి మళ్లీ పార్టీ తరపున పని చేయాలని ఆశ పడుతున్నారు. ఈ సభా వేదిక నుండి మరో సారి రాపాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై రాపాక ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Advertisement