Home » Andhra Pradesh » Naga Babu Strong Counter To Roja
andhra pradesh

Naga Babu : రోజా పరువు మొత్తం గంగ లో పోసిన నాగబాబు ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 12, 2023 4:37 pm
Advertisement

Naga Babu : తాజాగా మంత్రి రోజా ప్రారంభించిన ఓ కార్యక్రమం వైరల్ గా మారింది. ఏపీ మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాలలో హీరోయిన్ నటించి స్టార్ డం ని సంపాదించిన రోజా ఆ తర్వాత జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరించి ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీపై తెగ విరుచుకుపడుతుంది. అయితే అధినేత జగన్ వద్ద మార్కులు కొట్టేయాలని రోజా ఇలా చేస్తుందట. అందుకే సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.

Advertisement

Naga Babu strong counter to Roja

ఈమెకు తగ్గట్టు నాగబాబు కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా అంటే వెంటనే నాగబాబు రియాక్ట్ అవుతారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు రోజా ఫోటో ఒకటి ట్విట్టర్లో పెట్టి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అయితే ఓ వీధిలో నీటి కుళాయిని ప్రారంభిస్తున్న ఫోటోతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది రోజా. దీనిని నాగ‌బాబు షేర్ చేస్తూ ‘ హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా.

Advertisement

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం ‘ అంటూ అదిరిపోయే ట్వీట్ చేశారు. రోజాపై నాగబాబు వేసిన కౌంటర్ మామూలుగా లేదు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఇంతవరకు ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదు. అలాంటిది చిన్న నీటి కొళాయి ప్రారంభిస్తూ ఫోటోలు దిగటం అందరికీ నవ్వొచ్చేలా చేసింది. వైసీపీ అధికారంలో ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో రోజా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి నాగబాబు ట్వీట్ చేయడం ఇంకా వైరల్ గా మారిందని చెప్పవచ్చు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి