AP Union Minister post : కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Union Minister post : కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  పవన్ కళ్యాణ్ రుణం మోడీ తీర్చుకోబోతున్నాడా..?

  •  జనసేన కు కేంద్ర పదవి ఛాన్స్..?

AP Union Minister post : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు తెరతీయబోతుంది. వచ్చే నెలలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ప్రధాని మోదీ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వచ్చే ఎన్నికల దృష్ట్యా ఈ మంత్రివర్గ విస్తరణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మార్పుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి…

AP Union Minister post కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ

AP Union Minister post : కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ…?

AP Union Minister post  నాగబాబు కు కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్..?

ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్ స్థాయి మంత్రి, మరో సహాయ మంత్రి పదవి దక్కగా, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. జనసేనకు గతంలో అవకాశం ఇచ్చినా పవన్ కల్యాణ్ ఆసక్తి చూపకపోవడంతో వదిలేసారు. అయితే తాజా పరిస్థితుల్లో పవన్ కేంద్ర కేబినెట్‌లో పదవి స్వీకరించాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నాగబాబును కేంద్ర మంత్రిగా పంపించే యోచనలో పవన్ ఉన్నారు. అదే సమయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కూడా అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా… చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూడా ఈసారి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించడంతో, సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ బీసీ లేదా ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. ఇందులో చిత్తూరు లేదా హిందూపూర్ ఎంపీలలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే పరిగణనలో నంద్యాల ఎంపీ పేరు కూడా చర్చలో ఉంది. ప్రధాని మోదీ త్వరలో చేపట్టనున్న ఏపీ పర్యటన అనంతరం చంద్రబాబు – పవన్ కల్యాణ్ కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది