Nalli Bones Biryani: హైదరాబాద్‌లో ఫేమస్‌గా నల్లీబోన్స్ బిర్యానీ.. ఏ ఏరియాలో దొరుకుతుందో తెలుసా..?
Nalli Bones Biryani: బిర్యానీ పేరు వినగానే ఎవరికైనా టక్కున నోరూరుతుంది. అలా నోరూరని వారు చాలా తక్కువ మంది ఉంటారు. బిర్యానీకి ఉండే రుచి, సువాసనలు అలాంటివి మరి. ఇక బిర్యానీల్లో బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీకి దేశవిదేశాల్లో మాంచి క్రేజ్ ఉంది. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా రకరకాలుగా బిర్యానీలు చేస్తుంటారు. భోజన ప్రియులకు దమ్ బిర్యానీ, టిక్కా బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇలా ఎన్నో రకాలుగా బిర్యానీ లభిస్తుంది.
ఇప్పుడు హైదరాబాద్‌లో మరో కొత్త రకం బిర్యానీ ట్రెండ్ అవుతున్నది. అదే నల్లీ బోన్స్ బిర్యానీ (మూలుగ బొక్కల బిర్యానీ). వాస్తవానికి నల్లి బోన్స్ బిర్యానీ అనేది నార్త్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. కానీ, సౌత్ వాళ్లకు అంతగా పరిచయం కాలేదు. ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌తోపాటు ముంబైలో చాలా కాలంగా నల్లి బోన్స్ బిర్యానీ ఫేమస్. హైదరాబాద్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్తకొత్తగా ఈ నల్లీ బోన్స్ బిర్యానీ ట్రెండ్ అవుతున్నది. నగరంలోని చాలా రెస్టారెంట్లలో ఇప్పుడు నల్లి బోన్స్ బిర్యానీ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
హైదరాబాదీల టేస్టుకు తగ్గట్టే నగరంలోని బిర్యానీ హోటళ్ల వాళ్లు తరచూ కొత్తకొత్త రకం బిర్యానీలను అందుబాటులోకి తెస్తున్నారు. అందులో భోజన ప్రియుల ఆదరణ పొందనివి కనుమరుగై పోతుంటాయి. ఆదరణ పొందినవి సూపర్ సక్సెస్ అవుతాయి. తాజాగా నల్లి బోన్స్ బిర్యానీ హైదరాబాదీలకు సూపర్బ్‌గా నచ్చింది. అందుకే ఇప్పుడు నగరంలో మెజారిటీ రెస్టారెంట్‌లు తమ హోటళ్లలో స్పెషల్‌గా నల్లీ బోన్స్ బిర్యానీని ఆఫర్ చేస్తున్నాయి.
Nalli Bones Biryani: నల్లి బోన్స్ బిర్యానీ తయారీ ఎలా..?
నల్లి బోన్స్ బిర్యానీ అంటే కేవలం బొక్కలతో చేస్తారు.. ఏం టేస్ట్ ఉంటుంది అని పెదవి విరిచేరు. బిర్యానీ పేరులో బోన్స్ ఉన్నంత మాత్రాన అది కేవలం బోన్స్‌తో చేసే బిర్యానీ కాదు. నల్లీ బోన్స్‌పై ఉండే మాంసాన్ని తొలగించరు. పైన మాంసం, లోపల మూలుగతో కూడిన ముక్కలతో ఈ నల్లీ బోన్స్ బిర్యానీ తయారు చేస్తారు. ఇందుకోసం ముందుగా మాంసం నుంచి కేవలం మూలుగ బొక్కలను సేకరిస్తారు. తర్వాత వాటిని ప్రత్యేకంగా ఉడికించి కూర వండుతారు. మరోవైపు బాసుమతి బియ్యంతో సెపరేట్‌గా బిర్యానీ చేస్తారు. వడ్డించేటప్పుడు ఈ రెండింటిని కలిపి వడ్డిస్తారు. చెబుతుంటేనే నోరూరుతుంది కదా..! మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి.