Viveka Murder Case : వివేక హత్య కేసును జూన్ 2కి వాయిదా వేసిన నాంపల్లి సీబీఐ కోర్టు..!!
Viveka Murder Case నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు Viveka Murder Case పై హైదరాబాద్ Hyderabad లో నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ఈ హత్య కేసులో నిందితులను సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నిందితులు ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, అదేవిధంగా ప్రధానా నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోటికి హాజరు కావడం జరిగింది.
నిన్ననే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నీ తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం జరిగింది. అదే సమయంలో మే 5వ తారీఖు లోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే నేడు వాదోపవాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు కేసుని జూన్ రెండవ తారీఖుకి విచారణకి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇటీవలే ఈ కేసును జూన్ 30వ తారీకు లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేయడం జరిగింది. 2019 మార్చి 14వ తారీకు రాత్రి పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ విచారిస్తూ ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ ఉంది.