Kadapa.. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అప్‌డేట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadapa.. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అప్‌డేట్

 Authored By praveen | The Telugu News | Updated on :6 September 2021,7:19 pm

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు వై.ఎస్.వివేకానంద‌రెడ్డి హత్య కేసు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తున్నది. ఈ కేసు సీబీఐ ఆధ్వర్యంలో విచారణ షురూ అయి ఇప్పటికి 92 రోజులు అవుతున్నది. కాగా సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన కృష్ణమాచార్యులు అనే వ్యక్తిని ప్రొద్దుటూరు కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచారు.

 

ఈ నేపథ్యంలోనే అతడి నుంచి సెక్షన్ 164 కింద వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కృష్ణమాచార్యులు అనే వ్యక్తి కదిరిలో హార్డ్‌వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. వివేకా హత్య కేసు విషయమై అతడిని పలుమార్లు సీబీఐ విచారించింది. ఈ కేసు విచారణలో ఇప్పటికే చాలామార్లు కొత్త కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. సీబీఐ విచారణ పూర్తి అయితే తప్ప హత్య కేసు పూర్తి వివరాలు తెలిసేలా కనిపించడం లేదు. ఇకపోతే ఈ హత్య కేసులో వైఎస్ వివేకానందరెడ్డి కూతురును విచారించాలని గతంలో ఏపీ ప్రభుత్వానికి కొందరు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది