Nara Lokesh : వైసీపీ టాప్ నేత ఇంటికి చంద్రబాబు కొడుకు.. ఏపీ మొత్తం ఇదే బిగ్ న్యూస్

Advertisement

Nara Lokesh : టైటిల్ చూడగానే షాక్ అవుతున్నారా? మీరు చదివింది నిజమే. ఎందుకంటే… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. అసలు.. ఆయన వైసీపీ నేత ఇంటికి ఎందుకు వెళ్లారు అనే విషయం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అయింది. అయితే.. ప్రస్తుతం నారా లోకేశ్ బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో భాగంగా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరిగారు.

Advertisement

ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈనేపథ్యంలో నారా లోకేశ్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్నారు నారా లోకేశ్. అలాగే.. వైసీపీ ప్రభుత్వం పాలనలో పన్నుల భారం పెరగడంపై ప్రజలకు చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పై కూడా లోకేశ్ మండిపడ్డారు. బాదుడే బాదుడు పేరుతో జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది మాత్రం కొండంత అంటూ ధ్వజమెత్తారు.

Advertisement
Nara Lokesh goes to ysrcp leader house in mangalagiri
Nara Lokesh goes to ysrcp leader house in mangalagiri

Nara Lokesh : పన్నుల భారం తగ్గాలంటూ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం రావాలి

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేశ్ ఈ సందర్భంగా వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. ఆయన ఎవరో కాదు.. దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్. ఆయన ఇంటికి వెళ్లిన నారా లోకేశ్.. ఆయన్ను పరామర్శించారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లిన ఫోటోలను నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నారా లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. నిజానికి.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కానీ… గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓడిపోయిన లోకేశ్ ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. అందుకే మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి నుంచే పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేశ్.. మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement