Nara Lokesh : భీమ్లా నాయ‌క్ సినిమా చూడాల‌ని అనుకుంటున్నా.. నారా లోకేష్ ట్వీట్ వైర‌ల్‌

Authored By Sam C | The Telugu News | Published on: February 25, 2022, 2:30 pm

Nara Lokesh : ప‌వ‌న్, రానా కాంబినేష‌న్‌లో రూపొందిన భీమ్లా నాయ‌క్ చిత్రం ప్ర‌స్తుతం థియేట‌ర్ లో తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు గ‌త రాత్రి నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్నారు.తెలంగాణ‌లో చిత్రం బెనిఫిట్ షో వేయ‌గా, ఈ సినిమా చూసేందుకు ఏపీ నుండి అభిమానులు ఇక్క‌డికి వ‌చ్చారు. పలు థియేటర్ల వద్ద డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలంటూ అధికారుల ఆదేశాలివ్వడంతో.. ఆయా థియేటర్స్ వద్ద పోలీసుల్ని మోహరింపచేశారు. ప‌వ‌న్ సినిమాల‌పై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌న‌సేన నాయ‌కులు మాత్ర‌మే కాదు ఇత‌ర పార్టీవాళ్లు కూడా జ‌గ‌న్ వైఖ‌రిని దుయ్య‌బ‌డుతున్నారు.తాజాగా టిడిపి నేత నారా లోకేష్ కూడా భీమ్లా నాయక్ సినిమాని సపోర్ట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ” భీమ్లా నాయక్‌ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. నేను కూడా సినిమాని చూడాలని ఎదురు చూస్తున్నాను. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను నాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని భిక్షాటన చేసే గిన్నెగా మారుస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా ఇలాంటి కుట్రలను అధిగమించి మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను ” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

nara lokesh want to see bheemla nayak

nara lokesh want to see bheemla nayak

Nara Lokesh : లోకేష్ ఆస‌క్తి..

ప్ర‌స్తుతం లోకేష్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే భారీగా.. కోట్లాది అభిమానుల కోలాహలం మధ్య భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. కొన్ని చోట్ల మాత్రం థియేటర్ యాజమాన్యాలు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాం అంటూ బోర్డులు పెట్టారు. ఆయా థియేటర్ల దగ్గర పవన్ అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఎంతో ఆశతో సినిమా చూద్దామని వస్తే.. ఇలా షాకిస్తే ఎలా అని మండిపడుతున్నారు. వెంటనే థియేటర్లు ఓపెన్ చేయాలని.. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp