Narayana Gets Bail, Still ChandraBabu In Fear
ChandraBabu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఎన్నడూ లేనంత విధంగా హైరానా పడ్డారు మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ కావడంతో. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ పోలీసులు నిన్న హైద్రాబాద్‌లో అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి, చంద్రబాబు మొత్తం పరిస్థితిని ప్రత్యేకంగా ‘మానిటర్’ చేశారట. నారాయణ బెయిల్ మీద విడుదలయ్యేవరకు ఓ ప్రత్యేక న్యాయవాదుల బృందం చంద్రబాబు పర్యవేక్షణలో పని చేసిందని టీడీపీ అనుకూల మీడియానే చెబుతోంది.
‘దోషి అయితే శిక్షింపబడతాడు.. దోషి కాకపోతే, భయపడాల్సిన పనిలేదు.. మా ప్రభుత్వం ఎవరి మీదా కుట్ర పూరితంగా కేసులు నమోదు చేయదు. ఒకవేళ న్యాయస్థానంలో మాజీ మంత్రి నారాయణ ఊరట పొందినా.. కేసు విచారణ అయితే కొనసాగుతుంది..’ అంటూ పరిస్థితిని ముందుగానే ఊహించిన వైసీపీ, తాను చెప్పదలచుకున్నది చెప్పేసింది. అయినా, మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించి, విద్యా సంస్థల అధిపతిగా ఎదిగిన నారాయణ, మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు చేయించడమేంటి.. అని జనం ఛీత్కరించుకుంటున్నారు.
Narayana Gets Bail, Still ChandraBabu In Fear
ఇది వాస్తవానికి కొత్త విషయం కాదు, నారాయణతోపాటు శ్రీ చైతన్య అనే విద్యా సంస్థ కూడా చాలా ఏళ్ళుగా ఈ పేపర్ లీకేజీ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి కేటుగాళ్ళ భరతం పట్టాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, నారాయణకు బెయిల్ వచ్చినాగానీ, చంద్రబాబులో భయం తగ్గకపోవడానికి కారణం, అమరావతి కేసులో నారాయణ ఏ2 నిందితుడిగా చేర్చబడితే, చంద్రబాబు ఏ1 నిందితుడవడం. ఆ కేసులోనూ నారాయణ అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ న్యాయవాదుల్ని చంద్రబాబు అప్రమత్తం చేశారట.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.