Narendra Modi | ఎర్రకోటపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. పాకిస్థాన్‌కు కఠిన హెచ్చరిక
Narendra Modi | 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రసంగంలో పాకిస్థాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అణు బెదిరింపులను భారత్ ఇకపై ఏమాత్రం సహించబోదని తేల్చి చెప్పారు. అంతేకాదు, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఇక అమలుచేయదని ప్రకటిస్తూ సంచలనం సృష్టించారు.
నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు
#image_title
ప్రధాని మోదీ, ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉదహరిస్తూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. “ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు ” అని చెప్పిన ఆయన, దశాబ్ధాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇక కొనసాగించబోమని స్పష్టం చేశారు.
మన దేశం నీటి కొరతతో బాధపడుతుంటే, శత్రువు భూములు మాత్రం మన నీటితో తడవడం భరించదగినది కాదు. భారతదేశానికి చెందిన ప్రతి తుంపటి నీటి మీద మనకే హక్కు ఉంది అంటూ దేశ రైతుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ తరచూ చేస్తున్న అణు బెదిరింపుల పట్ల భారత్ తలొగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.