Nayanatara – Vignesh Sivan: పెళ్లికి ముందు దైవ దర్శనంలో నయన్ దంపతులు..నెట్టింట పిక్స్ వైరల్..

Authored By vamana sai | The Telugu News | Published on: April 28, 2022, 5:30 pm

Nayanatara – Vignesh Sivan: కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార – విగ్నేశ్ శివన్ ఎప్పుడెప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటవుతారా అంటూ అటు తమిళ ప్రేక్షకులు ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లైఫ్‌లో రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార చివరికి దర్శక, నిర్మాత విగ్నేశ్ శివన్‌తో మూడుముళ్ల బంధానికి సిద్ధమవుతోంది. అయితే, గత కొన్ని నెలలుగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి గానీ, దానికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం ఎవరూ ఇవ్వడం లేదు.

nayanatara-vignesh-sivan-visits temple

nayanatara-vignesh-sivan-visits temple

గత ఏడాది మాత్రం నయన్ – విగ్నేశ్‌ల ఎంగేజ్‌మెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యాయి. కేవలం రెండు కుటుంబాల సభ్యుల మధ్యనే ఈ ఎంగేజ్‌మెంట్ జరిగిందట. ఇక ఈ ఏడాది నయన్ – విగ్నేశ్‌తో పెళ్లి పీటలెక్కబోతుందని సమాచారం. కాగా, తాజాగా వీరిద్దరు తిరుమల వెంకటేశ్వర స్వామీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్‌ను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు.

Nayanatara – Vignesh Sivan: తమ చిత్రం భారీ హిట్ సాధించాలనే..

దాంతో త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్న నయన్ – విగ్నేశ్ ముందుగా ఇలా దైవ దర్శనానికి వెళ్ళినట్టున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార – సమంత – విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మల్టీస్టారర్ సినిమా కతు వాక్కుల రెండు కాదల్ సినిమా విడుదలైంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో రిలీజైంది. నేడు సమంత బర్త్ డే కావడం కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ కారణం. ఈ నేపథ్యంలో తమ చిత్రం భారీ హిట్ సాధించాలనే నయన్ దంపతులు ఇలా తిరుమల చేసుకొని దైవదర్శనం చేసుకున్నారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp