Neeraj Chopra : రజతం సాధించిన బల్లెం వీరుడు.. పతకం వచ్చినందుకు ఆనందమే కాని…!
ప్రధానాంశాలు:
Neeraj Chopra : రజతం సాధించిన బల్లెం వీరుడు.. పతకం వచ్చినందుకు ఆనందమే కాని...!
Neeraj Chopra : పారిస్ ఒలంపిక్స్ లో పతకాలు సాధించేందుకు భారత అథ్లెట్స్ చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్‌లో రజత పతకాన్ని కొల్లగొట్టాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.. 89.45 మీటర్ల త్రో విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. దీంతో వరుస ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా అతడు నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అతడు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల గాయాల బారిన పడినప్పటికీ కోలుకొని పారిస్ ఒలింపిక్స్‌లో ఏవిధంగా రాణించాడో నీరజ్ చోప్రా వెల్లడించాడు.
Neeraj Chopra అదొక్కటే బాధ..
త్రో విసిరినప్పుడల్లా తన దృష్టి 60-70 శాతం గాయంపైనే ఉంటుందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘‘ఈ రోజు నా పరుగు బాగోలేదు. వేగం కూడా తక్కువగా ఉంది. ఈ రోజు నేను ఏం చేసినా గాయం సమస్యతోనే చేశాను. శస్త్రచికిత్స చేయించుకునేందుకు నాకు సమయం లేదు. నన్ను నేను ముందుకు నెట్టుకున్నాను’’ అని నీరజ్ చోప్రా వెల్లడించాడు. నాలో చాలా సత్తా మిగిలి ఉంది. అది నేను అందుకోవాలి. అది నేను సాధించగలననే నమ్మకం ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సాధించకపోతే నేను శాంతించలేను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా నీరజ్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు కేవలం మూడు ఈవెంట్‌లలో మాత్రమే అతడు పాల్గొన్నాడు.
ఒలంపిక్స్‌లో పతకం సాధించినందుకు ఆనందంగానే ఉంది. కాకపోతే మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు కాస్త బాధగా ఉంది. భవిష్యత్ మరోసారి సాధిస్తానంటూ నీరజ్ చోప్రా చెప్పాడు.ఇక నీరజ్ సాధించిన ఘనతపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై తండ్రి సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. పాక్ అథ్లెట్ స్వర్ణం గెలవడంపై స్పందిస్తూ.. ఇది పాకిస్థాన్ రోజు అని వ్యాఖ్యానించారు. నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందిస్తూ.. తన కొడుకు రజత పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కొడుక్కి ఇష్టమైన ఆహారం వండి పెట్టేందుకు అతడి కోసం ఎదురుచూస్తుంటానని ఆమె చెప్పారు. ఇక స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని వ్యాఖ్యానించారు.