Bobbatlu Recipe : ఎంతో టేస్టీ టేస్టీ నేతి బొప్పట్లు… ఈజీ ప్రాసెస్ లో మీకోసం
Bobbatlu Recipe : బొప్పట్లు తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మందికి నేతి బొబ్బట్లు చేయడం రాదు. అలాగే మరికొందరికి చేయడం వచ్చిన అది చాలా పెద్ద ప్రాసెస్ అని చేయకుండా ఉంటారు. అయితే ఇది ప్రాసెస్ తో నేతి బొప్పట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1) గోధుమపిండి 2) ఉప్పు 3) పసుపు 4) నెయ్యి 5) నీళ్లు 6) బెల్లం 7) బొంబాయి రవ్వ 8) యాలకుల పొడి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పుల గోధుమపిండి, కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చపాతి పిండిలా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి గంటపాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అరకప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లో వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి.
మరుగుతున్నప్పుడు వేయించుకున్న బొంబాయి రవ్వ వేసి కలపాలి. దగ్గర పడ్డాక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం నీళ్లను వేసి బాగా కలుపుకొని చివర్లో కొద్దిగా యాలకుల పొడి, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఉండలులాగా చేసుకోవాలి. ఇప్పుడు బొప్పట్ల పిండిని కొద్దిగా తీసుకొని ఉండలాగా చేయాలి. పై పిండి కంటే లోపల పూర్ణం చిన్నగా ఉండేలా చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని బొప్పట్లు లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి బొప్పట్లు వేసి కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా నేతి బొప్పట్లు రెడీ.