
Never Before Political Heat In Telangana
Telangana Politics : తెలంగాణలో కనీ వినీ ఎరుగని స్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఏం మాట్లాడతారు.? అన్నదానిపై తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తెలంగాణ నడిబొడ్డున, హైద్రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సహా, బీజేపీ ముఖ్య నేతలంతా తెలంగాణకి రావడం ఇదే తొలిసారి. ఛార్మినార్‌ని ఆనుకుని వున్న భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ నేతలు పోటెత్తుతుండడంతో,
పాత బస్తీలో ఒకింత ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ ఈ ప్రాంతంలో కనిపించని రాజకీయ సందడి ఇది. పైగా, బోనాల సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైద్రాబాద్‌లో జరుగుతుండడం మరో ఆసక్తికరమైన అంశం. తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత వ్యూహాత్మకంగా, బీజేపీ జెండాల హంగామాని తగ్గించేందుకు తన అధికారాన్నంతా ప్రయోగించింది. కానీ, బీజేపీ గట్టిగా ప్రతిఘటిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.
Never Before Political Heat In Telangana
ఈ క్రమంలో తెలంగాణ గడ్డ మీద నుంచి, తెలంగాణ సమాజానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి పిలుపునివ్వనున్నారోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణకు గడచిన ఎనిమిదేళ్ళలో కేంద్రం ఏమీ ఇవ్వలేదన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపణ. అన్నీ ఇచ్చామన్నది బీజేపీ వాదన. ఎవరి లెక్కలు వాళ్ళవే. మొత్తంగా ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ప్రధాని ఏం మాట్లాడతారు.? దానికి కేసీయార కౌంటర్ ఎటాక్ ఎలా వుండబోతోంది.? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అంశాలు. రానున్న రోజుల్లో అన్ని విషయాలపైనా స్పష్టత వస్తుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.