Why on all clocks shows 10-10 time
Clock : మనం గూగుల్ లో గడియారం ఫోటోలను వెతికితే ఏ ఫోటో చూసినా అందులో 10 గంటల 10 నిమిషాలు అని టైమింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా గడియారం లేదా వాచ్ కొనటానికి గడియారం షాపులకు వెళితే అక్కడ ఉండే గడియారాలలో కూడా టైమింగ్ 10 గంటల 10 నిమిషాలు అని చూపిస్తాయి. అయితే ఎందుకు ప్రతి గడియారంలో లేదా వాచ్ లో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుందని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చాలామంది వరకు అయితే దీనిని అంతగా పట్టించుకోరు. అయితే ఇలా ఉండటానికి కూడా కారణం ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..అన్ని గడియారాలలో టైమింగ్ 10 గంటల 10 నిమిషాలు అని మాత్రమే ఉండాలని అవసరం లేదు.
ఇంతకుముందు కొన్ని గడియారం కంపెనీలు 8 గంటల 20 నిమిషాలు అని సమయాన్ని సెట్ చేశాయి. ఇప్పుడేమో 10 గంటల 10 నిమిషాలు అనే సమయం ట్రెండ్ గా మారింది. దీని వెనుక శాస్త్రీయపరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలా ఎందుకు ఉంటున్నాయో అని అనేక రకాల పుకార్లు ఉన్నాయి. కొందరేమో ఆ సమయంలో అబ్రహం లింకన్ చనిపోయాడని చెబుతారు. అసలు అబ్రహం లింకన్ మరణించిన సమయం 10 గంటల 15 నిమిషాలు. అలాగే అదే సమయంలో నాగసాకి హిరోషిమా పై బాంబుదాడి జరిగిందని కొందరు చెబుతూ ఉంటారు. ఇవన్నీ వాస్తవానికి నిజం కాదు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెబుతూ వచ్చారు. వాస్తవానికి ఈ సమయం వెనక నిజమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… నిజానికి గడియారాలలో 10 గంటల 10 నిమిషాలు అయినప్పుడు ఆ సమయంలో గడియారంలో V ఆకారం ఏర్పడుతుంది. ఈ V ఆకారం వలనే గడియారంలో 10 గంటల 10 నిమిషాలు ట్రెండ్ గా మారిందని చెబుతారు.
Why on all clocks shows 10-10 time
ఈ V ఆకారం అంటే విక్టరీ అని అర్థం. విక్టరీ అనగా విజయం అని అర్థం. ఇలా గడియారంలో 10 గంటల 10 నిమిషాలు ఏర్పడినప్పుడు ఈ V ఆకారంలో వచ్చే దానిని విక్టరీగా ఉపయోగిస్తున్నారు అని తెలుస్తోంది. ఇలా అన్ని గడియారాలలో ఈ V ఆకారం వచ్చేటట్లుగా సమయం సెట్ చేయడం వలన గడియారాలు వలన అధిక రాబడి వచ్చి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి గడియారం కంపెనీలు. అలాగే దీనికి మరొక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే వాచ్ లు తయారు చేసిన కంపెనీ బ్రాండ్ పేర్లు గడియారంలో స్పష్టంగా కనబడాలని ఇలా టైమింగ్ సెట్ చేశారు. ఎవరైనా వాచ్ ను కొనే ముందు ముందుగా వారి కళ్ళు రెండు ముళ్ళు మధ్యలో ఉండే కంపెనీ పేరుపై దృష్టి పడుతుంది. ఆ కంపెనీ పేరు తెలుసుకొని మంచిదా కాదా అని కొనుగోలు చేస్తారు. అందుకే గడియారాలలో సమయం ఇలా సెట్ చేశారని కూడా కొందరు ఉంటారు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.