Telangana Politics : తెలంగాణ రాజకీయం.! ఇంతకు ముందెన్నడూ కనిపించనంత వేడిగా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Politics : తెలంగాణ రాజకీయం.! ఇంతకు ముందెన్నడూ కనిపించనంత వేడిగా.!

Telangana Politics : తెలంగాణలో కనీ వినీ ఎరుగని స్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఏం మాట్లాడతారు.? అన్నదానిపై తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తెలంగాణ నడిబొడ్డున, హైద్రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సహా, బీజేపీ ముఖ్య నేతలంతా తెలంగాణకి రావడం ఇదే తొలిసారి. ఛార్మినార్‌ని ఆనుకుని వున్న భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ నేతలు పోటెత్తుతుండడంతో, పాత బస్తీలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 July 2022,7:40 am

Telangana Politics : తెలంగాణలో కనీ వినీ ఎరుగని స్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఏం మాట్లాడతారు.? అన్నదానిపై తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తెలంగాణ నడిబొడ్డున, హైద్రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సహా, బీజేపీ ముఖ్య నేతలంతా తెలంగాణకి రావడం ఇదే తొలిసారి. ఛార్మినార్‌ని ఆనుకుని వున్న భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ నేతలు పోటెత్తుతుండడంతో,

పాత బస్తీలో ఒకింత ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ ఈ ప్రాంతంలో కనిపించని రాజకీయ సందడి ఇది. పైగా, బోనాల సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైద్రాబాద్‌లో జరుగుతుండడం మరో ఆసక్తికరమైన అంశం. తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత వ్యూహాత్మకంగా, బీజేపీ జెండాల హంగామాని తగ్గించేందుకు తన అధికారాన్నంతా ప్రయోగించింది. కానీ, బీజేపీ గట్టిగా ప్రతిఘటిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.

Never Before Political Heat In Telangana

Never Before Political Heat In Telangana

ఈ క్రమంలో తెలంగాణ గడ్డ మీద నుంచి, తెలంగాణ సమాజానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి పిలుపునివ్వనున్నారోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణకు గడచిన ఎనిమిదేళ్ళలో కేంద్రం ఏమీ ఇవ్వలేదన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపణ. అన్నీ ఇచ్చామన్నది బీజేపీ వాదన. ఎవరి లెక్కలు వాళ్ళవే. మొత్తంగా ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ప్రధాని ఏం మాట్లాడతారు.? దానికి కేసీయార కౌంటర్ ఎటాక్ ఎలా వుండబోతోంది.? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అంశాలు. రానున్న రోజుల్లో అన్ని విషయాలపైనా స్పష్టత వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది