Munugode Bypoll : మునుగోడు బై పోల్‌పై కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ ..ఆ పార్టీ నేతలేమంటున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Munugode Bypoll : మునుగోడు బై పోల్‌పై కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ ..ఆ పార్టీ నేతలేమంటున్నారు?

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,10:21 pm

Munugode Bypoll : తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది. ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Munugode Bypoll : బీజేపీ, టీఆర్ఎస్ అంతర్గత మైత్రి..

బీజేపీ, టీఆర్ఎస్ విషయం ఎలా ఉన్నాఈ ఉపఎన్నికపై కాంగ్రెస్ గట్టిగానే ఫోకస్ పెట్టింది.తాజాగా మునుగోడు ప్రాంతానికి చెందిన నలుగురు కీలక నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.పార్టీ ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేసినా కలిసి పనిచేయాలని సూచించారట. అయితే, ఆ లీడర్లు కొత్త చర్చకు తెరలేపారట..మునుగోడులో పోటీకి దూరంగా ఉంటే మంచిదని కొందరు నేతలు రేవంత్ రెడ్డికి సూచించినట్టు విశ్వసనీయ సమాచారం.

new debate in the Congress party on Munugodu bypoll

new debate in the Congress party on Munugodu bypoll

టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది.ఈ రెండు పార్టీలు కావాలనే మునుగోడులో ఉపఎన్నిక వచ్చేలా చేశాయని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొందరు ఆరోపిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని టీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందంం చేసుకున్నాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే దాని ఎఫెక్ట్ ముందస్తు ఎన్నికలపై పడేలా ప్లాన్ చేసినట్టు ఆ నేతలు రేవంత్‌కు వివరించారట..కాగా, నేతల అనుమానాలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే, పోటీకి దూరంగా ఉంటే కాంగ్రెస్ ఒడిపోతుందని భయంతోనే ముందుకు రాలేదని ప్రచారం చేస్తాయని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట.. అందుకే ఎలాగైన మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు.ఇక్కడ తప్పకుండా గెలవాలని లేకపోతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని ముందే నేతలకు హింట్ ఇచ్చారట.. ఇప్పటివరకు మునుగోడు గడ్డపై కాంగ్రెస్ 12 సార్లు పోటీ చేస్తే ఆరుసార్లు గెలిచింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది