కొత్త పార్లమెంట్ బిల్డింగ్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు.. చీఫ్ గెస్టులు వీళ్లే?
ఏ దేశమైనా.. అక్కడ ఉండే పార్లమెంట్ కు ఎంతో చరిత్ర ఉంటుంది. ఎందుకంటే.. పార్లమెంట్ నుంచే దేశప్రజల కోసం ఎన్నో రకాల నిర్ణయాలు వెలువడుతుంటాయి. ఎన్నో చట్టాలు అక్కడే అవుతుంటాయి. అందుకే.. పార్లమెంట్ ఎంత బాగా ఉంటే.. ఎంత అణువుగా ఉంటే.. ప్రజల ఆకాంక్షలు అంతలా సఫలం అవుతాయి. అందుకే వందల ఏళ్ల పాత పార్లమెంట్ స్థానంలో సరికొత్త పార్లమెంట్ నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈనెల 10న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు విచ్చేయనున్నారు. వాళ్లతో పాటు.. వేరే పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం 200 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే.. వీళ్లలో ఎవరెవరు ఉన్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పార్లమెంట్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. ట్రయాంగిల్ షేప్ లో ఇప్పటి వరకు భారత్ లో లేనటువంటి సౌకర్యాలతో ఈ నిర్మాణం జరుగుతోంది. పార్లమెంట్ ను చూస్తే చాలు.. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ ఉట్టిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
2022లో జరగనున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ సమయంలోపు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి కొత్త పార్లమెంట్ లోనే 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వం జరుపుకోనుంది.