Rent House : అద్దె ఇంట్లో ఉండే వారికి కేంద్రం నుంచి కొత్త నిబంధనలు.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం..!
Rent House : ప్రతి వ్యక్తి సొంతంగా ఒక ఇల్లు ఉండాలని అనుకోవడం కామనే.. కానీ ప్రతి ఒక్కరు సొంత ఇల్లు నిర్మించుకోవడం కుదరదు. అంతేకాదు వృత్తి రీత్యా వేరే ప్రదేశాల్లో ఉండే వారు రెంట్ హౌస్ లో ఉంటారు తప్ప అక్కడ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం కుదరదు. అద్దె ఇల్లులో ఉండి ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది ఉన్నారు. అందుకే ఇప్పుడు అద్దె ఇళ్లు ఉండే యజమానులకు ప్రభుత్వ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది.
ఇప్పటి నుంచి ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే యజమాని కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది అద్దె ఒప్పందం.. అద్దె ఒప్పందం చేసుకోవాలి. అంతేకాదు ఒకసారి చేసుకున్న ఒప్పందాన్ని 11 నెలలకు ఒకసారి పునరుద్ధరించాల్సి ఉంటుంది. అద్దె ఒప్పందంపై సంతకం చేశాక ఇల్లు అద్దె దారుని ఆఈనంలో ఉంటుంది. ఆ టైం లో ఇంటి యజమాని నిబంధనలను మార్చే అవకాశం ఉండదు. మీ పర్మిషన్ లేకుండా యజమాని ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేదు.
Rent House కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన..
సార్వత్రిక బడ్జెట్ లో ఈ కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అద్దె నిబంధనలను మార్చుతూ కొత్త నిబంధనలను అమలు చేసేలా చూడాలని అధికారులను కోరింది. అంతేకాదు ఇంటి అద్దె ఇచ్చే వారు ప్రభుత్వానికి ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అద్దె నుంచి వచ్చే ఆదాయం ఎంత అన్నది యజమాని నిర్ధారించాలి. ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం వివరంగా చూపించాలని ప్రకటించారు.
అద్దెదారులు తమ ఇంటి ఆస్తిపై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలని.. అద్దె ఇంటిపై వచే ఆదాయంపై పన్ను ఉంటుందని దాన్ని ఏప్రిల్ 1 2024 నుంచి వర్తిస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.