New May Rules : కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఈ నెలలో జరిగే మార్పులు ఇవే..
New May Rules : దేశంలో ఈ నెల నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఈ రూల్స్.. మర్పులు సామాన్యులను కూడా ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకింగ్ రంగాల్లో.. ఇన్యూరెన్స్ పాలసీల్లో.. గ్యాస్ ధరలు ఇలా ఎన్నో మార్పులు జరగనున్నాయి.అయితే ఈ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు పని చేయవు. ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రాల వారీగా బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు. మేనెలలో దాదాపు12 రోజులు పాటు బ్యాంకులు పని చేయవని గుర్తుంచుకోవాలి.
అలాగే యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.15,000 లకు పెంచింది. అలాగే బ్యాంకింగ్ సేవల చార్జీలను కూడా పెంచేసింది. అయితే సదరు బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి పరిమితికి మించి అమౌంట్ విత్ డ్రా చేసుకుంటే గతంలో విదించిన చార్జెస్ ను రెండు రెట్లు పెంచింది.కరోనా సెకండ్ వేవ్ మధ్య కాలంలో IRDA ఆరోగ్య సంజీవని బీమా పాలసీలో కవర్ చేయాల్సిన మొత్తాన్ని రెండు రెట్లు పెంచింది. అంటే మే నుంచి భీమా కంపెనీలు రూ.10 లక్షల వరకు కవరేజ్ అందిస్తాయి.
ప్రతి నెలా సిలిండర్ ధర విషయంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కాగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెలా 1వ తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. అలాగే గ్యాస్ ధరలు మే 1 నుంచి మారనున్నాయి. కొత్త ధరలు నిర్ణయించి ప్రకటించనున్నారు. అలాగే ఈ నెలలో కోవిడ్ టీకాలకు సంబందించి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి తప్పనిసరిగా వాక్సిన్ వేయాలి. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.