PF Accounts : పీఎఫ్ ఖాతాల్లో కీలక మార్పులు.. ఈ తేదీ నుంచి అమలులోకి..!
PF Accounts : ఉద్యోగులకు ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ ఫండ్ పై ఉద్యోగులు భరోసాతో ఉంటారు కూడా. ఉద్యోగ విరమణ టైంలో తీసుకునే ఈ మొత్తానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది కూడా. ఉద్యోగులకు అత్యంత భరోసా ఇచ్చే పథకంగా ప్రావిడెంట్ ఫండ్ కు పేరు ఉంది. కాగా, ఈ పీఎఫ్ అకౌంట్స్ లో కీలక మార్పులు చేయబోతున్నారు. అవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే..ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగులకు భరోసా. కాగా, దీని ఆధారంగా తమ తదుపరి జీవితం గురించి ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటారు. కాగా, రానున్న రోజుల్లో ఈ మొత్తం పన్ను పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను గతేడాదే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది బడ్జెట్‌లోనే ఈ విషయాలను ప్రస్తావించారు.ఆ ప్రకారంగా..ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న ప్రావిడెంట్ ఖాతాలు రెండుగా విభజించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం నోటిఫై చేసి కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పీఎప్ ఖాతాలు రెండుగా విడిపోనున్నాయి. ఇలా చేయడం ద్వారా ఏటా రూ.2.5 లక్షణల కంటే ఎక్కువ మొత్తం వాటాగా చెల్లించే ఉద్యోగులపై పన్ను విధించే వెసులుబాటు ప్రభుత్వానికి లభిస్తుంది. పీఎఫ్ అకౌంట్స్ నిబంధనలివే..ప్రస్తుతమున్న పీఎఫ్ ఖాతాలను పన్ను విధించదగిన, విధించని వాటిగా విభజిస్తారు.

new rules to pf account holders
PF Accounts : ఖాతాలు రెండు రకాలుగా విభజన..
పన్ను విధించని అకౌంట్స్ లోకి మార్చి 31, 2021 నాటి వరకు ఉన్న వారి మొత్తం ఉంటుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. కాగా, ఆదాయ పన్ను విభాగపు విధానాలను సీబీడీటీ రూపొందిస్తుంది. ఏటా రూ2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని వాటాగా చెల్లించే ఉద్యోగులపై కొత్త పన్ను విధించేందుకుగాను ఐటీ నిబంధనల్లో కొత్తగా సెక్షన్ 9D చేరనుంది.మార్చి 31, 2020 నాటికి ఈపీఎఫ్ ఓలో 24.77 కోట్ల సభ్యుల ఖాతాలుండగా, వీరిలో 14.36 కోట్ల మందికి యూనిక్ అకౌంట్ నెంబర్ జారీ అయ్యాయి.