Nimmagadda : రిటైర్ అయ్యాక.. తన పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ న్యూస్ చెప్పిన నిమ్మగడ్డ?
Nimmagadda : నిమ్మగడ్డ రమేశ్ కుమార్… కొందరు ఈయన్ను వీడు మగాడ్రా బుజ్జి అంటారు. ఎందుకంటే.. ఏపీకి ఎన్నికల కమిషనర్ గా ఉండి… ఏపీ ప్రభుత్వాన్నే ముప్పు తిప్పలు పెట్టిన అధికారి ఈయన. ఏపీ ప్రభుత్వం మాత్రం… నిమ్మగడ్డను మరోరకంగా చూస్తుంది. ఏది ఏమైనా.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరు… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎన్నికల కమిషనర్… ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం… అది కూడా ఎన్నికల విషయంలో ఇదే మొదలు. చివరకు ఎన్నికల కమిషనర్ పవర్ ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపించి మరీ రిటైర్ అయ్యారు నిమ్మగడ్డ.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించి… తాజాగా మార్చి 31న పదవీ విరమణ పొందారు నిమ్మగడ్డ. తన విధుల్లో ఇవాళ చివరి రోజు కావడంతో తన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన నిమ్మగడ్డ… పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సహకరించిన అందరికీ ఈసందర్భంగా నిమ్మగడ్డ థ్యాంక్స్ చెప్పారు. అలాగే కొత్త ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీకి నిమ్మగడ్డ అభినందనలు తెలియజేశారు. సమయం లేకపోవడం వల్ల పరిషత్ ఎన్నికలను నిర్వహించలేకపోయామని… నిమ్మగడ్డ తెలియజేశారు.
Nimmagadda : రాజకీయాల్లోకి రావడంపై నిమ్మగడ్డ క్లారిటీ
అయితే… తాను రాజకీయాల్లో వస్తానంటూ వస్తున్న ప్రచారంపై తాజాగా నిమ్మగడ్డ నోరు విప్పారు. రాజకీయాల్లోకి తాను వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అదంతా ఉత్త ప్రచారమని.. తనకు రాజకీయాలు పడవని… రాజకీయాల్లోకి వెళ్లి పోరపాటు చేయబోను… అంటూ రాజకీయ రంగ ప్రవేశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నిమ్మగడ్డ.
అంటే… నిమ్మగడ్డ రాజకీయాల్లోకి రారన్నమాట. అలాగే… తనకు ఉన్న ఓటు హక్కు గురించి కూడా నిమ్మగడ్డ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
నాకు ఇదివరకు తెలంగాణలో ఓటు హక్కు ఉండేది. తర్వాత దాన్ని నా సొంత గ్రామానికి మార్చుకోవాలని అనుకున్నా. నా ఓటును నా ఊరికి మార్చుకుంటే వచ్చిన తప్పేంటి. దేశంలో ఎక్కడైనా ఓటు వేసే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. నా హక్కుల సాధన కోసం ఒక పౌరుడిగా రేపటి నుంచి పోరాడుతా. దీనిపై హైకోర్టుకు వెళ్లడానికి కూడా నేను సిద్ధం.. అంటూ నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు.