Nimmagadda ramesh : షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ : ‘ నిమ్మగడ్డ జైలు కి ‘ ఈ మాట అన్నది ఎవరో కాదు
Nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ ఎన్నికల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న తరహాలో వైరం కొనసాగుతోంది. ఇటీవల పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మీరు కనుక నిమ్మగడ్డ రమేష్ మాటలు విని వైకాపాకు అడ్డు తగలడం వంటివి జరిగితే ఖచ్చితంగా మిమ్ములను బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. దాంతో నిమ్మగడ్డ రమేష్ కు కోపం వచ్చింది. అధికారులనే బెదిరిస్తారా అంటూ మంత్రి అయిన పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఎన్నికలు పూర్తి అయ్యే వరకు నోట మాట రాకూడదని, ఆయన మీడియా ముందు మాట్లాడకూడదు అంటూ ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హౌస్ అరెస్ట్ నుండి ఉపశమనం లభించింది.
Nimmagadda ramesh : కోర్టు ఊరటతో నిమ్మగడ్డపై మళ్లీ ఫైర్..
నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంను హైకోర్టు కొట్టి వేయడంతో పాటు మంత్రి అయిన పెద్ది రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం సభబు కాదంటూ తేల్చి చెప్పింది. దాంతో ఆయన ఆనందంకు అవధులు లేకుండా పోయింది. అయితే మీడియాతో మాట్లాడటం నిషేదం ఉన్నా కూడా ఎలాగూ మాట్లాడటం తన వ్యాఖ్యలు బయటకు రావడం కామన్. కనుక చాలా ఉపశమనం లభించడంతో మరో సారి నిమ్మగడ్డ రమేష్ పై మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో నిమ్మగడ్డ ను జైలుకు పంపించబోతున్నట్లుగా ప్రకటించాడు. మంత్రులను మరియు ఎమ్మెల్యేలను వేదించడంతో పాటు వారి అధికారాలను కట్ చేసేందుకు ప్రయత్నించడం వంటి కారణాల వల్ల నిమ్మగడ్డ శిక్షార్హుడు అవ్వబోతున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.
ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా శిక్షిస్తుంది..
రాజ్యంగం ఇచ్చిన హక్కులు చేతిలో ఉన్నాయి కదా అని నిమ్మగడ్డ చేస్తున్న పనులకు ఖచ్చితంగా ప్రతిఫలం సీరియస్ గానే అనుభవించాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నాడు. పలువురు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అతి త్వరలోనే ప్రివిలేజ్ కమిటీ ఆయన్ను విచారించబోతుంది. తద్వార ఖచ్చితంగా ఆయనకు రెండు నుండి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పదు అంటూ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి బలంగా చెబుతున్నాడు. మంత్రుల మరియు ఎమ్మెల్యేల అధికారాలను హరించేందుకు నిమ్మగడ్డ రమేష్ చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారంగానే జరిగిందని అన్నాడు. ప్రతి అడుగు కూడా చంద్రబాబు డైరెక్షన్ లో వేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.