Nose | ముక్కులోని వెంట్రుకలని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా.. ఇది చాలా డేంజర్
Nose | ఆయుర్వేదం ప్రకారం ముక్కు శరీరానికి కేవలం శ్వాసకోశ అవయవం మాత్రమే కాదు, రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం వంటి ఆయుర్వేద గ్రంథాలలో ముక్కు నిర్మాణం, పనితీరు, వైద్య విధానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముక్కును ‘ప్రాణాయ ద్వారం’ అని పిలుస్తారు, అంటే శరీరానికి ప్రాణశక్తి ప్రవేశించే ద్వారం.

#image_title
ముక్కు ద్వారా చికిత్స
ఆయుర్వేదంలో ముక్కు నేరుగా మెదడుతో అనుసంధానమైందని చెబుతారు. అందుకే నస్య కర్మ అనే వైద్య విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో ముక్కు ద్వారా ఔషధాలను అందించడం జరుగుతుంది. ఇది తలనొప్పి, నిద్రలేమి, మానసిక అలసట, స్మృతి లోపం, ఆందోళన, కళ్ళు–గొంతు సమస్యలు, నరాల రుగ్మతలకు ఉపయోగపడుతుంది.
ముక్కులో ఉండే చిన్న వెంట్రుకలు, శ్లేష్మం హానికరమైన కణాలు, బ్యాక్టీరియా, ధూళిని ఫిల్టర్ చేస్తాయి. గాలిని శుద్ధి చేసి ఊపిరితిత్తులకు చేరే ముందు దాని ఉష్ణోగ్రత, తేమను సరిచేస్తుంది. చల్లని లేదా కలుషిత గాలి నేరుగా శరీరంపై ప్రభావం చూపకుండా అడ్డుకుంటుంది. ఆయుర్వేదం, యోగా ప్రకారం అన్ని శ్వాస వ్యాయామాలు ముక్కు ద్వారా చేయాలి. అనులోమ–విలోమ, నాడి శోధన, భ్రమరి వంటి ప్రాణాయామ పద్ధతులు మానసిక ప్రశాంతత, నాడీ వ్యవస్థ బలపాటు, ప్రాణ శక్తి సమతుల్యానికి దోహదపడతాయి.