Health Tips | దేశంలో పెరుగుతున్న ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి.. వాటితో చెక్ పెట్టొచ్చా..!
Health Tips | దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా చిన్న జలుబుగా అనిపించే ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాలు, మారుతున్న వాతావరణం, గాలిలో తేమ పెరగడం, శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి కారణాలు ఫ్లూ వ్యాప్తికి దోహదం చేస్తాయి. దగ్గు, తుమ్ముల ద్వారా వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వేగంగా పాకుతుంది.

#image_title
ముఖ్య లక్షణాలు
ఫ్లూ సోకిన వారికి అధిక జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, నిరంతర దగ్గు, ముక్కు కారడం, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అల్లం మరియు తేనె ఫ్లూ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తుంటారు.అల్లంలో ఉండే జింజెరాల్ పదార్థం శ్వాసనాళాల ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగజేస్తుంది.
తేనెలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల గొంతులోని జలుబు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.అల్లం-తేనె మిశ్రమం ఫ్లూను పూర్తిగా నివారించకపోయినా, దాని లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని వైద్య సలహా మేరకు మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.