Outsourcing Jobs : ఏపీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు.. పదో తరగతి ఉంటే చాలు..!
ప్రధానాంశాలు:
Outsourcing Jobs : ఏపీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు.. పదో తరగతి ఉంటే చాలు..!
Outsourcing Jobs : కృష్ణా జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ రంగాలలో వివిధ పోస్టుల భర్తీకి రెండు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను ప్రకటించింది . జిల్లా ఆరోగ్య సంస్థల్లోని 18 పోస్టుల్లో ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-II – 4 పోస్టులు (కాంట్రాక్ట్), మహిళా నర్సింగ్ ఆర్డర్లీ- 8 పోస్టులు (ఔట్ సోర్సింగ్), శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ -6 పోస్టులు (ఔట్ సోర్సింగ్) భర్తీ చేస్తున్నారు. ఎన్‌హెచ్ఎం కింద ఫిజిషియన్ అండ్ మెడికల్ ఆఫీసర్ -1 పోస్టు (ఫిజిషియన్ లేకపోతే మెడికల్ ఆఫీసర్‌ను భర్తీ చేస్తారు), స్టాప్ నర్స్ -5 పోస్టులు, డీఈఐసీ మేనేజర్- 2 పోస్టులు, ఆడియోలజీస్టు అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్టు- 1 పోస్టును భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాంక్ట్ పద్దతిలో భర్తీ చేస్తారు.
Outsourcing Jobs ఇలా చేయండి..
జిల్లా ఆరోగ్య సంస్థల్లో పోస్టులకు ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-II – రూ.32,670, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ- రూ.15,000, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ -రూ.15,000 ఉంటుంది. ఎన్‌హెచ్ఎం పోస్టులకు ఫిజిషియన్ అండ్ మెడికల్ ఆఫీసర్ -రూ.1,10,000 (ఫిజిషియన్), రూ.61,960 (మెడికల్ ఆఫీసర్), స్టాప్ నర్స్ -రూ.27,675, డీఈఐసీ మేనేజర్- 36,465, ఆడియోలజీస్టు అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్టు- రూ.30,000 ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 డిసెంబర్ 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. గరిష్టంగా వయస్సు 52 ఏళ్లు మించకూడదు.
విద్యా అర్హతలు, అనుభవం ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా ఉన్నాయి. పదో తరగతి నుంచి వోకేషనల్, నర్సింగ్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ ఆయా పోస్టులకు విద్యా అర్హతులు ఉన్నాయి. అలాగే కొన్ని పోస్టులకు అనుభవంకూడా కావాలి. జిల్లా వైద్యా సంస్థల్లో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి. 1. జిల్లా వైద్య సంస్థల్లో పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయించారు. ఎన్‌హెచ్ఎం పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులకురూ.100 ఉంటుంది. సంబంధిత సర్టిఫికేట్ల, డీడీని జతచేసి, గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి దరఖాస్తును డిసెంబర్ 17 తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి.