
Sai Pallavi Dominating in Junior NTR
NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్ రానున్న రోజులలో వరుస పాన్ ఇండియా చిత్రాలతో పలకరించబోతున్నాడు. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిపారు. ఇక మేకర్స్ కూడా అభిమానులని ఆనందపరిచేందుకు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చారు. కొరటాల శివతో చేయనున్నNTR30 డైలాగ్ మోషన్ టీజర్ విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఇక NTR31 సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కానుంది.
ntr-says-sorry-to-his-fans
ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తారక్ గడ్డం, మీసం కట్టుతో ఊర మాస్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన నందమూరి తారక రామారావు ఆర్స్ట్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశాడు.
”నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. సుదూర ప్రాంతాల నుండి ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు చూపించే ఈ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సుల ముందు ఏదీ ఎక్కువ కాదు. నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఎవ్వరినీ కలవలేకపోయాను. అందుకు సారీ చెబుతున్నా” అని ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూ సిన నందమూరి ఫ్యాన్స్ లవ్ యూ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.