Valchar : దారుణంగా పడిపోయిన రాంబదుల సంఖ్య.. పెరుగుతున్న మానవ మరణాలు..!
Valchar : ఇదేంటి రాంబదుల సంఖ్య తగ్గిపోవడానికి మానవ మరణాలు పెరగడానికి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఇదే అంశాన్ని ఈ ఆర్టికల్‌లో క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ మధ్య కాలంలో మీరెప్పుడైనా రాబందులను చూశారా? అఫ్‌కోర్స్ చూసి ఉండరనే అనుకుంటున్నా. ఎందుకంటే 98 శాతం రాబందులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఉన్నవి కాస్త మానవ కార్యకలాపాలకు బయపడి ఎక్కడెక్కడో సంచరిస్తున్నాయి. రాబందుల మరణాలు పెరగడం కారణంగా ఇండియాలో 2000-2005 మధ్య కాలంలో వైరస్‌లు వ్యాప్తి చెంది వేల మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా ? అసలు రాబందులు చనిపోతే మనుషులు ఎందుకు చనిపోతున్నారు ?. శవాలను పీక్కుతినే ఈ పక్షులు మనుషులను ఎలా కాపాడుతాయి ?
ఇన్‌ఫెక్షన్ల నుంచి, వైరస్‌ల నుంచి.. మన పరిసరాల్లో రాబందులు స్కావెంజర్లుగా పని చేస్తుంటాయి. ఇవి చనిపోయిన జంతువులను తింటుంటాయి. అంటే చనిపోయిన జంతువుల శరీరాల నుంచి వైరస్‌లు వ్యాపించకుండా కీ రోల్ పోషిస్తుంటాయి. రాబందులే లేకపోతే చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్లి వైరస్‌లు వ్యాపిస్తుంటాయి.మన దేశంలో ఒకప్పుడు రాబందులు పెద్ద సంఖ్యలో కనిపించేవి. చనిపోయిన జంతువుల కళేబరాలు వెతుకుతూ ఆకాశంలో ఎగురుతుండేవి. కానీ గత రెండు దశాబ్ధాలుగా మన దేశంలో రాబందుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 1990 పిరియడ్‌లో దాదాపు 5 కోట్ల రాబందులు ఉండేవి. కానీ ప్రస్తుతం వాటిలో 98 శాతం చనిపోయాయి. దీనికి కారణం పశువుల ట్రీట్‌మెంట్‌కు వాడే మందులు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పశువులకు వాడే పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్స్, డైక్లో ఫినాక్ వంటి మందులు రాబందులకు ప్రాణాంతకంగా మారాయి. వీటి కారణంగా చాలా రాబందులు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతున్నాయి. దీని కారణంగా పశువులకు డైక్లో ఫినాక్ వాడకం ఆపేయాలని చెప్పి 2006లొ బ్యాన్ విధించించారు. దాంతో కొన్ని ప్రాంతాల్లో రాబందుల మరణాలు తగ్గాయి. కానీ ఇప్పటికే రాబందుల సంఖ్య తగ్గిపోయినట్లు స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ పేర్కొంది.
పశువుల భారీ కళేబారాలను తినే ఈ పక్షలు చనిపోవడంతో డేంజరస్ బ్యాక్టిరియాలు, ఇన్‌ఫెక్షన్లు పెరిగిపోయాయని అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2000-2005 మధ్య కాలంలో లక్ష మందికి పైగా జనాలు వైరస్‌లు సోకి చనిపోయారని ఈ రిపోర్ట్‌లో తేలింది. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో రాబందుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. రాబందుల జనాభా పడిపోయిన తర్వాత మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మనుషుల మరణాల సంఖ్య 4 శాతం పెరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఇవి బాగా తగ్గిపోయిన 2000-2005 మధ్య కాలంలో హ్యుమన్ డెత్ రేట్ పెరిగింది. ప్రతి ఏడాది అదనంగా లక్ష మంది చనిపోవడానికి ఇదే కారణమని రీసెర్చర్స్ చెబుతున్నారు. దీనివల్ల మన దేశం ఏడాదికి రూ.5,77,754 నష్ట పోయిందని రీసెర్చర్స్ చెబుతున్నారు.
Valchar : దారుణంగా పడిపోయిన రాంబదుల సంఖ్య.. పెరుగుతున్న మానవ మరణాలు..!
కుక్కలు కూడా చనిపోయిన జంతువుల కళేబరాలు తింటాయి. కాకపోతే రాబందుల మాదిరి పరిసరాల నుంచి అంత ఎఫెక్ట్‌గా బ్యాక్టీరియాను తుడిచివేయలేవు. అంతేకాకుండా కుక్కలు ఈ కళేబరాలను సరిగ్గా తినకపోవడం వల్ల, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మనం తాగే నీళ్లలో పాథోజన్లు, బ్యాక్టీరియాలు పెరుగుతాయి. రాబందులు చనిపోయిన తర్వాత డ్రింకింగ్ వాటర్‌లో హానికారక బ్యాక్టీరియాలు రెండింతలు పెరిగినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే రాబందుల మరణానికి పశువులకు వాడే మందులు ఒక్కటే కారణం కాదు. అభివృద్ధి పేరుతో మానవ కార్యకలాపాలు పెరుగడం, అటవీ సమతుల్యత దెబ్బతినడం వంటివి కూడా కారణాలుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన సర్వేలో దక్షిణ భారతదేశంలో 300 పైగా రాబందులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాల నేపథ్యంలో కొవిడ్ వంటి మహమ్మారిలు మానవాళిని తుడిచిపెట్టకముందే వనరులను, వన్య ప్రాణులను కాపాడేందుకు అంతా కలిసి పటిష్ట చర్యలు తీసుకోవాలి.
Ashadha Purnima : ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఈ జులై మాసంలో అంటే ఆషాడ మాసంలో పౌర్ణమి…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో…
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
This website uses cookies.