Nuvvula Pulusu Recipe : నువ్వుల పులుసు ఇలా చేసారంటే… రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nuvvula Pulusu Recipe : నువ్వుల పులుసు ఇలా చేసారంటే… రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం…

Nuvvula Pulusu Recipe : నువ్వులు ఆరోగ్యపరంగా చాలా మంచివి. మన శరీరానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. పురాతన కాలం నుంచి ఈ నువ్వులను మన భారతీయులు ఉపయోగిస్తున్నారు. నువ్వులతో వివిధ రకాల వంటలను చేస్తుంటారు. అందులో ఒకటే నువ్వుల లడ్డూలు. నువ్వులతో చేసిన లడ్డూలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తినడం వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఉండే క్యాల్షియం మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన ఎముకలను బలంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,12:20 pm

Nuvvula Pulusu Recipe : నువ్వులు ఆరోగ్యపరంగా చాలా మంచివి. మన శరీరానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. పురాతన కాలం నుంచి ఈ నువ్వులను మన భారతీయులు ఉపయోగిస్తున్నారు. నువ్వులతో వివిధ రకాల వంటలను చేస్తుంటారు. అందులో ఒకటే నువ్వుల లడ్డూలు. నువ్వులతో చేసిన లడ్డూలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తినడం వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఉండే క్యాల్షియం మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే నువ్వులలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇలా నువ్వులతో చాలా లాభాలు ఉన్నాయి. అయితే నువ్వులను లడ్డూలు మాత్రమే కాకుండా నువ్వులతో పులుసు కూడా తయారు చేసుకోవచ్చు.

ఈ నువ్వుల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) నువ్వులు 2) బియ్యం 3) తాజా కొబ్బరి 4) జీలకర్ర 5) కరివేపాకు 6) కొత్తిమీర 7) ఉల్లిపాయ 8) బెల్లం 9) పచ్చిమిర్చి 10) ఆవాలు 11) మెంతులు 12) ఎండుమిర్చి 13) నూనె 14) చింతపండు తయారీ విధానం: ముందుగా ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నానబెట్టిన బియ్యం, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు, మూడు టేబుల్ స్పూన్ల తాజా కొబ్బరి తురుము ఈ మూడింటిలో మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

nuvvula pulusu recipe in telugu

nuvvula pulusu recipe in telugu

తర్వాత కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత ముప్పావు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు, రెండు ఎండుమిర్చిలను వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను,నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాస్త వేగాక మెత్తగా రుబ్బిన నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. చివరిగా కొద్దిగా చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన బెల్లం తురుము వేసి మరి కాసేపు మరిగించి వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత తింటే నువ్వుల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. అంతే.. చాలా ఈజీగా నువ్వుల పులుసును చేసుకోవచ్చు. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది