OG |‘ఓజీ’ ట్రైలర్ వాయిదాతో ఫ్యాన్స్ అసహనం.. భారీ ఈవెంట్‌లోనే రిలీజ్ చేయనున్న మేకర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

OG |‘ఓజీ’ ట్రైలర్ వాయిదాతో ఫ్యాన్స్ అసహనం.. భారీ ఈవెంట్‌లోనే రిలీజ్ చేయనున్న మేకర్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :21 September 2025,12:00 pm

OG |‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఓజీ’ (OG) ట్రైలర్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. మేకర్స్ ఇటీవలే ట్రైలర్‌ను ఈ ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు సాయంత్రం జరగనున్న ‘ఓజీ కన్సర్ట్’ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేస్తామని తాజా ప్రకటన చేశారు. అయితే ఈ నిర్ణయం అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది.

Pawan Kalyan తప్పు వాళ్ల మీద నెట్టేసిన పవన్ కళ్యాణ్ OG వీరమల్లు లేట్ కి కారణం ఆయన కాదట

 

కాస్త డిలే..

గబ్బర్‌సింగ్‌లోని పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను షేర్ చేస్తూ ఈ అప్‌డేట్ ఇవ్వడం ఫ్యాన్స్‌ను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. ట్రైలర్ కోసం బాగా ఎదురు చూస్తున్న అభిమానులు, ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడం సరైన పద్ధతి కాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “మనోభావాలతో ఇలా ఆడుకోవడం తగదు” అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ట్రోల్లింగ్ కూడా మొదలైంది.

ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. ‘ఫైర్ స్ట్రోమ్’, ‘సువ్వి సువ్వి’, ‘గన్స్ అండ్ రోజెస్’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన తర్వాత ఇటీవలే వచ్చిన ‘వాషి యో వాషి’ పాటతో సోషల్ మీడియా మళ్ళీ ఊగిపోతోంది. పవన్ చెప్పిన జపనీస్ డైలాగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ వస్తోంది. ఇక ఈ హైప్‌ను మరింత పెంచేందుకు సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒక భారీ ఈవెంట్‌ను ‘OG Concert’ పేరిట ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది