Ntv No.1 Channel : మరోసారి తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో సత్తా చాటి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఎన్టీవీ..!!
Ntv No.1 Channel : తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎన్టీవీ ప్రయాణం చాలా విభిన్నమైనది. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో 24*7 నిరంతరం సరికొత్త కంటెంట్ తో వార్తలను ప్రసారం చేస్తూ ఉంటది. ఎక్కడా కూడా అవస్తవాలకు చోటు లేకుండా నాణ్యమైన వార్తలను అందిస్తూ… పార్టీలకు.. ప్రాంతాలకు అతీతంగా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తూ… నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పటంలో ప్రజలకు చేరవేయటంలో ఎన్టీవీ ఎప్పుడూ ముందుంటది.
ఛానల్ ప్రారంభించిన నాటి నుంచి ప్రేక్షక ఆదరణ పొంది రేటింగ్స్ లో రికార్డులు అందుకుంటూ పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు… జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ బ్రేకింగ్ న్యూస్ మరియు లైవ్ రిపోర్టింగ్ చేయటంలో ఖచ్చితమైన సర్వేలకు ఎన్టీవీ పెట్టింది పేరు. ఈ రకమైన కృషితో బార్క్ రేటింగ్స్ లో మరోసారి ఎన్టీవీ సత్తా చాటింది. తాజాగా 71.9 పిఆర్పీలతో మొదటి స్థానం పదిలం చేసుకుంది. ప్రతిక్షణం ప్రజాహితం అనే స్లోగన్ కి తగ్గట్టుగానే… ప్రజలకు వార్తల అందించడంలో ఎన్టీవీ మరోసారి తన దమ్ము ఏంటో నిరూపించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజల పక్షాన ఉండటంతో భార్క్ రేటింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు మీడియా రంగంలో ఎలాంటి పరిస్థితిలోనైనా…
దేనికి కూడా బెదరకుండా వాస్తవాలను చూపించడంలో.. అన్యాయాన్ని నిలదీయడంలో..ఎన్టీవీ తీరు వేరు. అధికారంలో ఉన్న వారైనా, ప్రతిపక్షంలో ఉన్న వారైనా.. ఎవరినైనా సరే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం… తనదైన శైలిలో కథనాలు ప్రసారం చేసి సమస్యలను పరిష్కరించడంలో.. ప్రతిక్షణం ప్రజాహితం అన్న విధంగా.. పనిచేస్తూ ఉంటది. దీంతో మరోసారి టీఆర్పి రేటింగ్స్ లో ఎన్టీవీ సత్తా చాటడం జరిగింది.