Media : సిగ్గుచేటు… తెలుగు రాష్ట్రాల్లో ‘కరాటే’కు మించిన సమస్యే లేదా ?
Media ప్రస్తుతం తెలుగు మీడియా దృష్టి అంతా కూడా కరాటే కళ్యాణి ఇష్యూపై ఉంది. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తో వివాదం మొదలు అయినప్పటి నుండి కరాటే కళ్యాణి గురించి దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆమెకు సంబంధించిన ఇష్యూను ఒక జాతీయ సమస్య మాదిరిగా చూపిస్తూ తెగ హడావుడి చేయడంతో పాటు ఆమెకు సంబంధించిన చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించడం విడ్డూరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాలి అనే కనీస బాధ్యత లేకుండా కరాటే కళ్యాణి విషయంలో రచ్చ చేయడం విడ్డూరంగా ఉంది.
రోడ్డు మీద ఫ్రాంక్ చేశారు అంటూ విశ్వక్ సేన్ పై ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమం పెట్టడం.. అక్కడ రకరకాల వ్యవహారాలు జరిగి నానా రచ్చ జరగడం అయ్యింది. ఫ్రాంక్ వీడియోల గురించి అప్పటి నుండి ఇంకా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అదేదో పెద్ద అంతర్జాతీయ విషయం అయినట్లుగా ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ కూడా పదే పదే వాటి గురించి మాట్లాడుతూ చర్చలు పెడుతూ ప్రత్యేక కథనాలు ఇస్తూ మీడియా అంటేనే అసహ్యం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు.

shameless telugu electronic media focusing on karate kalyani issue
ఇలాంటి వివాదాస్పద విషయాలను జనాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు అనే ఉద్దేశ్యంతో కరాటే కళ్యాణి విషయాన్ని దాదాపు అన్ని మీడియా వారు కూడా ఫోకస్ పెట్టారు. ఆమె ఇంటి వద్ద ఏకంగా లైవ్ టెలికాస్ట్ వ్యాన్ లతో మీడియా మకాం వేసి ఉంది. ఆమె గత రెండు మూడు రోజులుగా కనిపించక పోవడంతో.. ఆమె ఇంటికి చైల్డ్ లేబర్ అధికారులు వెళ్లడం.. పోలీసులు వెళ్లడం వంటి అప్డేట్స్ ను గంట గంటకు ఇస్తూ అసలు విషయాలను పక్క దారి పట్టిస్తున్నారు. తెలంగాణ మరియు ఏపీలో కేంద్రం లో చాలా కీలక పరిణామలు జరుగుతున్నా కరాటే కళ్యాణి.. ఫ్రాంక్ వీడియోలు అంటే సొల్లు చెబుతూ మీడియా పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు.