one plus comes with new smart phone
One Plus : చాలా మంది వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కాని వాటి ధర చూస్తుంటే వణుకు పడుతుంటుంది. దాదాపు రూ.30,000 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్‌లో మొబైల్స్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లిస్ట్ అయ్యాయన్నది ఆ వార్తల సారాంశం. లీక్స్ ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుందని అంచనా.ఇటీవల స్నాప్‌డ్రాగన్ 695 బాగా పాపులర్ అయింది. ఇప్పటికే ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో కొన్ని స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 లాంటి మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ రూ.20,000 లోపు ధరలోనే రిలీజ్ కావడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని అంచనా.
one plus comes with new smart phone
ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ ఉండదు.4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంటున్నారు .వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్2టీ మోడల్స్ కూడా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్ నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన లీక్స్, న్యూస్ వన్‌ప్లస్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చూస్తుంటే రానున్న రోజులలో వన్ ప్లస్ మరిన్ని ఆఫర్స్ తో కస్టమర్స్‌కి మంచి ఆనందం అందించనుందని తెలుస్తుంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.