One Plus : వ‌న్ ప్ల‌స్ సంచ‌ల‌నం… రూ.20 వేల లోపు అంద‌మైన స్మార్ట్ ఫోన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

One Plus : వ‌న్ ప్ల‌స్ సంచ‌ల‌నం… రూ.20 వేల లోపు అంద‌మైన స్మార్ట్ ఫోన్..!

One Plus : చాలా మంది వ‌న్ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్స్ కొనేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. కాని వాటి ధ‌ర చూస్తుంటే వ‌ణుకు ప‌డుతుంటుంది. దాదాపు రూ.30,000 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్‌లో మొబైల్స్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో మరో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 March 2022,2:30 pm

One Plus : చాలా మంది వ‌న్ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్స్ కొనేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. కాని వాటి ధ‌ర చూస్తుంటే వ‌ణుకు ప‌డుతుంటుంది. దాదాపు రూ.30,000 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్‌లో మొబైల్స్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లిస్ట్ అయ్యాయన్నది ఆ వార్తల సారాంశం. లీక్స్ ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుందని అంచనా.ఇటీవల స్నాప్‌డ్రాగన్ 695 బాగా పాపులర్ అయింది. ఇప్పటికే ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో కొన్ని స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 లాంటి మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ రూ.20,000 లోపు ధరలోనే రిలీజ్ కావడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని అంచనా.

one plus comes with new smart phone

one plus comes with new smart phone

One Plus : వ‌న్ ప్ల‌స్ ఆఫ‌ర్స్..

ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ ఉండదు.4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంటున్నారు .వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్2టీ మోడల్స్ కూడా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్ నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన లీక్స్, న్యూస్ వన్‌ప్లస్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చూస్తుంటే రానున్న రోజుల‌లో వ‌న్ ప్ల‌స్ మ‌రిన్ని ఆఫ‌ర్స్ తో క‌స్ట‌మ‌ర్స్‌కి మంచి ఆనందం అందించ‌నుంద‌ని తెలుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది