OnePlus Nord 2T : వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలుసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

OnePlus Nord 2T : వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలుసా

 Authored By mallesh | The Telugu News | Updated on :9 May 2022,5:30 pm

OnePlus Nord 2T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ తనకంటూ ప్రత్యేక యూజర్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. వన్ ప్లస్ నార్డ్ 2T పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అనేక రకాల ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోన్ ను కంపెనీ కేవలం యూరప్ మార్కెట్లోనే విడుదల చేసింది. అక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కు 399 యూరోలుగా ధరను నిర్ణయించారు.

ఇండియన్ రూపాయలలో ఈ ధర రూ. 32,100 గా ఉండనుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43 అంగుళాల ఎమోల్​డ్ డిస్ ప్లేను అందజేశారు. ఇక ఇది మీడియా టెక్ డైమెన్ సిటీ 1300 ఎస్ ఓపీ ప్రాసెసర్ తో వర్క్ చేయనుంది. వన్ ప్లస్ నార్డ్ 2T స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే అదిరిపోయే రేంజ్ లో కెమెరాను అందజేశారు.ఈ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపీ రియర్ కెమెరాను అందజేశారు.

OnePlus Nord 2T another smartphone release from one plus

OnePlus Nord 2T another smartphone release from one plus

ఇక అందమైన, ఆకర్షణీయమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఈ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు దిగడం చాలా ఈజీ అవుతుంది. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 4500 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీని అందజేశారు.ఇక ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది. తక్కువ ధరలో ఎన్నో ఫీచర్స్ అందజేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో కనుక రిలీజ్ అయితే చాలా మంది టెక్ ప్రియులు ఈ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది