Home » Health » Onion Tea Helps In Keeping Your Heart Healthy
Health

Onion tea | ఉల్లిపాయ టీ ఆరోగ్య రహస్యం .. ఉదయాన్నే తాగితే అనారోగ్య సమస్యలకు గుడ్‌బై

Authored By
Sam C
The Telugu News | Published on: August 22, 2025, 7:00 am
Advertisement

Onion tea | ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇప్పుడు ఆ ఉల్లిపాయతో టీ తయారుచేసి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ టీ శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందించి అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Advertisement

 

ఉల్లిపాయ టీ తాగడం వల్ల కలిగే లాభాలు:

Advertisement

రక్తపోటు నియంత్రణ : ఉల్లిపాయ టీలో ఉండే ఫ్లేవనాల్ అనే పోషకం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

నిద్రలేమి నివారణ : శాంతిచెందిన నిద్రకు తోడ్పడే సహజ మూలకాలు ఉల్లిపాయలో ఉంటాయి.
క్యాన్సర్ నివారణకు తోడు : యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి.
చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం : మధుమేహం ఉన్న వారికి ఇది సహజమైన ఔషధంగా పనిచేస్తుంది.
రక్తహీనతకు ఉపశమనం : ఉల్లిపాయలోని ఐరన్, ఇతర పోషకాలు రక్తహీనతను తగ్గించడంలో సహకరిస్తాయి.
జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ : కడుపు వాపు, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు నివారించవచ్చు.
బరువు తగ్గించడంలో తోడ్పాటు : మేతబాలిజాన్ని పెంచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుదల : గుండె సంబంధిత రుగ్మతలకు మంచి నివారణగా మారుతుంది.

Advertisement

ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలి?

ఓ పెద్ద బౌల్‌లో రెండు గ్లాసుల నీరు పోయాలి. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక లేదా రెండు ఉల్లిపాయలు , కొద్దిగా అల్లం , దాల్చిన చెక్క , యాల‌కులు, లవంగాలు వంటి మసాలా దినుసులు వేయాలి. మరిగించి సుమారు 10–15 నిమిషాలు బాగా ఉడికించాలి.. తర్వాత చల్లకున్న టీని గాజు గ్లాసులో వడగట్టి సర్వ్ చేసుకోవాలి.. చివరగా, రుచికి తగినంత తేనె కలిపితే టీ రుచి మరిగిపోతుంది. ఈ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం అత్యుత్తమం . ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాక, డే స్టార్ట్‌కి ఎనర్జీని కూడా అందిస్తుంది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి