Categories: DevotionalNews

Ganesh Chaturthi : ఏకదంతుడిగా గణేశుడు.. విరిగిన దంతం వెనుక ఉన్న పురాణ కథలు తెలుసా?

Ganesh Chaturthi :  వినాయక చవితి సమీపిస్తుండడంతో గణేశుడి వివిధ రూపాలు, నామాలు గురించి చర్చ మొదలైంది. “విఘ్నేశ్వరుడు”, “గజాననుడు”, “లంబోదరుడు”, “బాలచంద్ర”, “హేరంబ” వంటి అనేక పేర్లతో పిలవబడుతుంటాడు. “ఏకదంతుడు”  అనే పేరు ద్వారా ప్రత్యేక గుర్తింపు పొంద‌డంతో గణేశుడిని ఎందుకు ‘ఏకదంతుడు’గా పిలుస్తారు? అతనికి ఒకే ఒక్క దంతం ఎందుకు మిగిలింది? ఈ ప్రశ్నలకు పురాణాల్లో మూడు ప్రముఖ కథలు వినిపిస్తాయి.

#image_title

మూడు క‌థ‌లు..

ఒక కథ ప్రకారం పరశురాముడు కైలాసానికి వచ్చి శివుడిని దర్శించాలనుకున్నాడు. కానీ గణేశుడు తన విధి నిబద్ధతతో అతన్ని ఆపాడు. ఆ స‌మ‌యంలో ఓ దంతం విరిగింద‌ని అంటారు. రెండోది వేదవ్యాసుడు మహాభారత కథ చెబుతుండగా, గణేశుడు అదే సమయంలో రచన చేస్తూ ఉండేవాడు. ఒక షరతు ప్రకారం రచన మధ్యలో ఆగకూడదని వేదవ్యాసుడు చెప్పాడు. ఆ సమయంలో గణేశుడి కలం విరిగిపోయింది. అప్పుడతను తన దంతాన్ని విరిచి , దానిని కలంగా మార్చుకుని రచన కొనసాగించాడు.

మరో ఆసక్తికర కథ ప్రకారం, గజముఖాసురుడు అనే రాక్షసుడిని ఏ ఆయుధంతోనూ చంపలేమని తెలిసిన గణేశుడు, తన దంతాన్ని ఆయుధంగా మారుస్తూ , గజముఖాసురుడిని సంహరించాడు. దీనివల్ల గణేశుడి దంతం విరగడం ఓ విజయ గాధగా మారింది. ఈ మూడు కథలవల్ల గణేశుడికి “ఏకదంతుడు” అనే నామం కలిగిందని హిందూ మత విశ్వాసం చెబుతోంది. “ఏకదంతం” అంటే “ఒక పన్ను గలవాడు” అనే అర్థం. గణేశుడి విగ్రహాల్లో ఒక దంతం విరిగినట్టు ఉండడం కూడా దీనికే సూచన.

Recent Posts

Kamini Konkar | భర్తను కాపాడాలని అవయవం దానం చేసిన భార్య – నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి

భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…

42 minutes ago

Health Tips | మీరు వేరు శెన‌గ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి

Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…

2 hours ago

Heart Attack | గుండెపోటు వచ్చే ముందు ఈ సంకేతాలు క‌నిపిస్తాయ‌ట‌.. అస్సలు నిర్ల‌క్ష్యం చేయోద్దు..

Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…

3 hours ago

Moong Vs Masoor Dal | పెసరపప్పు-ఎర్రపప్పు.. ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?

Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…

4 hours ago

Health Tips | సన్‌స్క్రీన్ వాడిన వారికి విట‌మిన్ డి లోపం వ‌స్తుందా.. నిపుణుల స‌మాధానం ఏంటంటే..!

Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…

5 hours ago

Health Tips | కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌కాయ ర‌సం..ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…

6 hours ago

vinayaka chavithi | వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఇంట్లోనే స్పెష‌ల్‌గా చేసుకునే మోదకాలు ఏవి?

vinayaka chavithi| వినాయక చవితి సందర్భంగా మోదకాలను ఇంట్లో తయారుచేసి శ్రీ గ‌ణేశుడికి నివేదించ‌డం జ‌రుగుతుంది… అలా చేస్తే రుచి,…

7 hours ago

Credit Cards : ఇలా క్రెడిట్ కార్డ్స్ తో షాపింగ్ చేస్తే మీకు ఫుల్ గా డబ్బులు సేవ్ అవుతాయి..!!

Credit Card Using : పండుగల సందర్భంగా, లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్స్‌లో చాలా…

16 hours ago