Cyber Crime : వామ్మో..జాగ్రత్త.. ఒక్క క్లిక్ రూ.82 లక్షలు పోగొట్టుకునేలా చేసింది
ప్రధానాంశాలు:
Cyber Crime : వామ్మో..జాగ్రత్త.. ఒక్క క్లిక్ రూ.82 లక్షలు పోగొట్టుకునేలా చేసింది
Cyber Crime : ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేరస్థులు నిత్యం కొత్త పద్ధతులను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, నమ్మకం కలిగించిన తర్వాత మోసానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లను మోసగాళ్లు వినియోగించుకుంటున్నారు. థానేలో ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటనలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Cyber Crime : వామ్మో..జాగ్రత్త.. ఒక్క క్లిక్ రూ.82 లక్షలు పోగొట్టుకునేలా చేసింది
cyber crime వామ్మో..జాగ్రత్త అమ్మాయిలని క్లిక్ చేస్తే మొత్తం పోతాయి
ఈ సంఘటనలో బాధితుడు సంజయ్‌కు ఒక గుర్తు తెలియని మహిళ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. సంజయ్ దాన్ని అంగీకరించడంతో వారి మధ్య చాట్ మొదలైంది. క్రమంగా స్నేహం పెరిగి ఆ మహిళ క్రిప్టోకరెన్సీ వ్యాపారం గురించి చెప్పడం ప్రారంభించింది. క్రిప్టోలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికింది. ఆమె చెప్పిన ప్రకారం సంజయ్ క్రిప్టో వాలెట్‌లో ఖాతా తెరిచాడు. అంతేకాదు ఆమె ఏర్పాటుచేసిన ఆర్థిక సలహాదారుడి సాయంతో సంజయ్ పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు.
సంజయ్ పెట్టుబడి పెట్టిన మొదట్లో అతనికి లాభాలు వచ్చినట్లు చూపించారు. కానీ డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయానికి మహిళ అనేక సాకులు చెప్పి ఆలస్యం చేసేందుకు ప్రయత్నించింది. చివరకు తాను మోసపోయినట్లు గ్రహించిన సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో అతను రూ.82 లక్షలు పోగొట్టుకున్నాడు. కాసర్వాడవలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా ఎవరితోనూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. ముఖ్యంగా ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని, నమ్మకమైన మార్గాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.